News September 8, 2024
భారీ వర్షాలు.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, వైద్యశిబిరాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. జిల్లా స్థాయిలో చేస్తున్న పనులకు తక్షణం నిధులు విడుదల చేస్తామని తెలిపారు.
Similar News
News October 10, 2024
దేవాలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం చేసుకోకూడదంటూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి గుడిలో వైదిక కమిటీని నియమించాలంది. నూతన సేవలు, ఫీజులు, కళ్యాణోత్సవ ముహూర్తాలు వంటి అంశాల్లో కమిటీ సూచనలు అధికారులు పాటించాలంది. కమిటీలో భిన్నాభిప్రాయాలు ఉంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలంది.
News October 10, 2024
సిండికేట్లకు సహకరిస్తే ఉపేక్షించం: మంత్రి కొల్లు
ఏపీలో మద్యం షాపులను సొంతం చేసుకోవడానికి కొందరు సిండికేట్లుగా ఏర్పడుతున్నారనే ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక ఆదేశాలు జారీ చేశారు. దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలకు తావివ్వొద్దని, రాజకీయ ఒత్తిళ్లు తలొగ్గొద్దని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు ప్రక్రియ, షాపుల కేటాయింపులు పారదర్శకంగా ఉండాలన్నారు. సిండికేట్లకు సహకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నెల 16నుంచి కొత్త మద్యం షాపులు తెరుచుకోనున్నాయి.
News October 10, 2024
టాటా కార్లు.. ప్రయాణికుల భద్రతే ప్రధానం
ఎన్నో రంగాలకు విస్తరించినా ‘టాటా’ పేరు చెప్పగానే గుర్తొచ్చేది కార్లే. టాటా ఇండికా మొదలుకొని, నానో వరకు ఎన్నో మోడళ్లను తీసుకొచ్చిన ఘనత ఆ కంపెనీది. అందులో రతన్ టాటా కృషి ఎనలేనిది. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతకు టాటా అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఇండియాలో మొట్టమొదటి 5/5 రేటింగ్ సాధించిన కారు టాటా నెక్సాన్. దీని సృష్టికర్త రతన్ టాటానే.