News September 2, 2024

భారీ వర్షాలు.. ప్రధానికి సీఎం రేవంత్ లేఖ

image

TG: వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రానికి తక్షణ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇవాళ సీఎం ఖమ్మంలో పర్యటించి రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు మహబూబాబాద్, వరంగల్‌లో పర్యటించనున్నారు.

Similar News

News September 18, 2024

‘మ్యాడ్ స్క్వేర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

image

నార్నె నితిన్ హీరోగా కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తూ ఈనెల 20న ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గతేడాది బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రానుండగా నాగవంశీ నిర్మిస్తున్నారు.

News September 18, 2024

మీ నోటికి తాళం వేసుకోండి చంద్రబాబు: అంబటి రాంబాబు

image

AP: రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే నోటికి తాళం వేస్తానన్న సీఎం చంద్రబాబు హెచ్చరికపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి తాళాలు వేస్తారు? అక్రమంగా ఉన్న మీ ఇంటికి ముందు తాళం వేయండి. అప్పటి వరకు మీ నోటికి తాళం వేసుకోండి’ అని ట్వీట్ చేశారు.

News September 18, 2024

నెల్లూరులో జానీ మాస్టర్!

image

అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై నెల్లూరు పోలీసులను నార్సింగి పోలీసులు సంప్రదించారని సమాచారం. దీంతో జానీ మాస్టర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశముంది.