News September 25, 2024

భారీ వర్షాలు.. తీవ్ర విషాదం

image

TG: భారీ వర్షాలు రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపాయి. పిడుగుపాటుకు వివిధ ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు. భద్రాద్రి(D) దమ్మపేట(మ) జగ్గారంలో వర్షం పడుతోందని ఓ చెట్టు కిందకు వెళ్లడంతో సమీపంలో పిడుగుపడి నాగశ్రీ(22), అనూష(23) చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మహబూబ్‌నగర్, కరీంనగర్, NZB జిల్లాల్లో ఇద్దరు వృద్ధులు, మరో వ్యక్తి(29) తుదిశ్వాస విడిచారు.

Similar News

News October 9, 2024

ఆ విద్యార్థులకు పాత సిలబస్‌తో పబ్లిక్ ఎగ్జామ్స్

image

AP: పదో తరగతి 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాల్లో చదివి ఫెయిల్ అయిన ప్రైవేట్, రీ ఎన్‌రోల్ విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు SSC పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న వారికి కొత్త సిలబస్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయన్నారు. క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు.

News October 9, 2024

FLASH: న్యూజిలాండ్‌కు బ్యాడ్ న్యూస్

image

ఇండియాతో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముంగిట న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 16న బెంగళూరులో మొదలయ్యే టెస్టుకు కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండట్లేదని ఆ జట్టు సెలక్టర్లు ప్రకటించారు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అతడు అసౌకర్యానికి గురయ్యారు. కేన్ లేకపోవడం న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగానికి పెద్దలోటే.

News October 9, 2024

నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు

image

TG: డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో వీరిని హైదరాబాద్ తీసుకురానున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపికైన టీచర్లకు దసరా సెలవులు ముగిసే లోపే పోస్టింగులు ఇచ్చేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు.