News July 22, 2024

భారీ వర్షాలు.. వరద గుప్పిట్లో పొలాలు

image

AP: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. ప.గో, తూ.గో, ఏలూరు, కోనసీమ, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. కేవలం ఉమ్మడి తూ.గోలోనే సుమారు 65వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అంచనా. మరో 20వేల ఎకరాల్లో నారుమళ్లు నీళ్లలోనే ఉన్నాయి. అటు వాగులు పొంగి పొర్లుతుండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Similar News

News November 15, 2025

గిల్ రిటైర్డ్ హర్ట్.. IND 3 వికెట్లు డౌన్

image

SAతో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. సుందర్(29) అవుటవ్వగానే బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ తాను ఆడిన మూడో బంతికే ఫోర్ బాదారు. అయితే ఆ షాట్ కొట్టగానే ఆయన మెడ పట్టేసింది. కాసేపు నొప్పితో బాధపడ్డ గిల్ బ్యాటింగ్ చేయలేక మైదానాన్ని వీడారు. అతని స్థానంలో పంత్ బ్యాటింగ్‌కు వచ్చారు. మరోవైపు భారత్ 109 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. రాహుల్(39) కూడా ఔట్ అయ్యారు.

News November 15, 2025

PGIMERలో 151 పోస్టులు

image

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (<>PGIMER<<>>) 151 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC,STలకు రూ.800, దివ్యాంగులకు ఫీజు లేదు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, MS, MA/MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

News November 15, 2025

హనుమాన్ చాలీసా భావం – 10

image

భీమరూప ధరి అసుర సంహారే | రామచంద్ర కే కాజ సంవారే ||
ఆంజనేయుడు భయంకరమైన, భీకరమైన రూపాన్ని ధరించి, శక్తివంతమైన రాక్షసులను సంహరించాడు. తన సొంత ప్రయోజనం కోసం కాకుండా, శ్రీ రామచంద్రుడను నమ్మి ఆయన ముఖ్య కార్యాలను విజయవంతంగా పూర్తి చేశాడు. ఎంతటి శక్తి ఉన్నా.. ఆ బలాన్ని ఉత్తమ ధర్మాన్ని నిలబెట్టడానికి, దైవ కార్యాలను నెరవేర్చడానికి మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే మన జీవిత లక్ష్యం నెరవేరుతుంది. <<-se>>#HANUMANCHALISA<<>>