News July 22, 2024
భారీ వర్షాలు.. వరద గుప్పిట్లో పొలాలు
AP: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. ప.గో, తూ.గో, ఏలూరు, కోనసీమ, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. కేవలం ఉమ్మడి తూ.గోలోనే సుమారు 65వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అంచనా. మరో 20వేల ఎకరాల్లో నారుమళ్లు నీళ్లలోనే ఉన్నాయి. అటు వాగులు పొంగి పొర్లుతుండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Similar News
News October 14, 2024
‘విదేశీ విద్యానిధి’ అర్హులకు గుడ్ న్యూస్?
TG: రాష్ట్రంలో విదేశీ విద్యా నిధి పథకం లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే SC, ST, BC సంక్షేమ శాఖలు ఇందుకు సంబంధించిన ఫైలును CMOకు పంపినట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫైలును CM రేవంత్ ఆమోదిస్తారని, ఉత్తర్వులు కూడా జారీ అవుతాయని వార్తలు వస్తున్నాయి. కాగా బీసీ లబ్ధిదారులను 300 నుంచి 800, ఎస్సీలను 210 నుంచి 500, ఎస్టీలను 100 నుంచి 500కు పెంచాలని ప్రతిపాదనలు పంపారు.
News October 14, 2024
మళ్లీ దూసుకొస్తున్న ట్రంప్
US అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పుంజుకున్నారు. మొన్నటి వరకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ విజయం ఖాయమని సర్వేలు అంచనా వేశాయి. ఆమె వైపు 48% మంది అమెరికన్లు మొగ్గు చూపగా ట్రంప్‌నకు 44% మంది మద్దతు పలికారు. అయితే తాజా సర్వేల్లో ఈ అంతరం 2శాతంగా ఉంది. ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కమలకు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది.
News October 14, 2024
భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
AP: అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తమైన అధికారులు ఆ 5 జిల్లాల్లోని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా రాష్ట్రంలో గురువారం వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.