News September 1, 2024

భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు పాటించండి

image

☞ తడిచిన విద్యుత్ స్తంభాలు, తడి చేతులతో స్టార్టర్లు, మోటార్లు, స్విచ్ బోర్డులు ముట్టుకోవద్దు
☞ విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను కూడా ముట్టుకోవద్దు
☞ చిన్న పిల్లలు కరెంట్ వస్తువుల జోలికి రాకుండా చూసుకోవాలి
☞ ఇనుప తీగలపై దుస్తులు ఆరబెట్టుకోవద్దు
☞ ఉరుములు, మెరుపుల సమయంలో డిష్ వైర్, టీవీ నుంచి తీసివేయాలి

Similar News

News February 19, 2025

మస్క్: నలుగురితో సంసారం, 13 మంది పిల్లలు

image

అపరకుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కుటుంబం గురించి చాలా మందికి తెలియదు. ఆయన ఏకంగా 13 మంది పిల్లలకు తండ్రి అని నేషనల్ మీడియా పేర్కొంది. ఆయన నలుగురితో సంసారం చేయగా, వారికి 13 మంది పిల్లలు కలిగినట్లు తెలిపింది. మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ గ్రిమ్స్‌తో ముగ్గురు పిల్లలు, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌తో ముగ్గురు, రచయిత ఆష్లే సెయింట్‌తో ఒక్కరు ఉన్నారు.

News February 19, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట

image

TG: పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు, రాధాకిషన్ రావుకు ఊరట లభించింది. కేసు దర్యాప్తుపై కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ (మార్చి 3) వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు హరీశ్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని క్వాష్ చేయాలని హరీశ్ రావు, రాధాకిషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

News February 19, 2025

ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని డిమాండ్

image

తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల రాక ముందే ఎండలు మండిపోతున్నాయి. ఉ.10 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో స్కూళ్లలో ఈసారి ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సాధారణంగా మార్చి మూడో వారం నుంచి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. పరీక్షలు ముగిసే వరకు ఉ.7.45 నుంచి మ.12.30 వరకు స్కూళ్లు పని చేస్తాయి.

error: Content is protected !!