News September 9, 2024
తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు భారీ వర్షాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. TGలోని ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట, WGL, ASF, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, గద్వాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
Similar News
News January 10, 2025
స్కూళ్లకు సెలవులు షురూ
AP: రాష్ట్రంలో సంక్రాంతి సందడి మొదలైంది. స్కూళ్లకు నేటి నుంచి సెలవులు మొదలయ్యాయి. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు సొంతూళ్లకు బయల్దేరారు. ఈ నెల 20న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. అటు తెలంగాణలోని స్కూళ్లకు రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి.
News January 10, 2025
TG: స్కిల్స్ యూనివర్సిటీలో మరో 3 కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
☛ ఎండోస్కోపీ టెక్నీషియన్: 6 నెలల శిక్షణ. ఇంటర్ BiPCలో 50% మార్కులు, 25 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. ఫీజు ₹10వేలు
☛ టీ వర్క్స్ ప్రోటో టైపింగ్ స్పెషలిస్ట్: 2 నెలల కోర్సు. టెన్త్ పాసై, 18-25 ఏళ్ల వయసుండాలి. ఫీజు ₹3వేలు
☛ మెడికల్ కోడింగ్& స్టాఫ్ స్కిల్స్ ప్రోగ్రామింగ్ (55 డేస్): BSC(లైఫ్ సైన్సెస్) పాసవ్వాలి. వయసు 18-25. ఫీజు ₹18వేలు
☛ వెబ్‌సైట్: https://yisu.in/
News January 10, 2025
తిరుమలలో VIP కల్చర్.. మీ కామెంట్?
AP: తిరుమలలో వీఐపీ కల్చర్ పెరుగుతోందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి వేలాది మంది భక్తులు వచ్చినా ప్రముఖులకే పెద్దపీట వేస్తున్నారని వాపోతున్నారు. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వీఐపీ కంటే సాధారణ భక్తులపై ఫోకస్ చేయాలని, 1-2 గంటల్లో దర్శనం అయ్యేలా చూడాలని సూచించారు. దీనిపై మీ కామెంట్?