News August 31, 2024
హైదరాబాద్‌లో స్కూళ్లకు సోమవారం సెలవు
TG: రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా హైదరాబాద్‌లోని అన్ని స్కూళ్లకు కలెక్టర్ సోమవారం సెలవు ప్రకటించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News September 15, 2024
ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం.. 600 ప్రత్యేక బస్సులు
TG: ఎల్లుండి వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా HYDలోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. GHMC పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15-30 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సదుపాయాన్ని వినియోగించుకొని నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
News September 15, 2024
వరద బాధితులకు భారీ విరాళం
AP: రాష్ట్రంలో వరద బాధితులకు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రూ.7.70 కోట్ల విరాళం అందజేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చెక్కు అందజేసినట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు YVB రాజేంద్ర తెలిపారు. వరద బాధితుల కోసం రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఒక నెల గౌరవ వేతనం ఇచ్చామన్నారు.
News September 15, 2024
రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసిన నాని మూవీ
వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు దాటినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఇప్పుడు సరిపోయిందంటూ రాసుకొచ్చింది. గత నెల 29న థియేటర్లలో విడుదలైన ‘సరిపోదా శనివారం’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూవీలో సూర్య నటన, జేక్స్ బెజోయ్ మ్యూజిక్‌కు సినీ ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.