News October 15, 2024
భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ముందుజాగ్రత్తగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
Similar News
News November 6, 2024
భార్యను కౌగలించుకొని, ముద్దుపెట్టిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం పొందడంతో డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా కన్వెన్షన్ సెంటర్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన భార్య మెలానియా ట్రాంప్‌ను కౌగలించుకొని ముద్దు పెట్టి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా ఉంటూ విజయం కోసం ఎంతో కష్టపడి పనిచేశారని ఆయన కొనియాడారు. చనిపోయిన మెలానియా తల్లి కూడా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండి ఉంటారని చెప్పుకొచ్చారు.
News November 6, 2024
ముగ్గురు US ప్రెసిడెంట్లతో మోదీ సావాసం
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక లాంఛనమైపోవడంతో ఆయనకు భారతీయులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా 2014 నుంచి ముగ్గురు అధ్యక్షులు మారినా మోదీ మాత్రం భారత ప్రధానిగానే ఉన్నారని గుర్తుచేస్తున్నారు. 2014-17 వరకు ఒబామా, 2017-21 వరకు ట్రంప్, 2021- 24 వరకు బైడెన్, మళ్లీ ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మూడు పర్యాయాలుగా మోదీ వీరితో సావాసం చేస్తున్నారు.
News November 6, 2024
ఢిల్లీకి బయల్దేరిన పవన్ కళ్యాణ్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఇవాళ సాయంత్రం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. శాంతి భద్రతల అంశంపై షాతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం తర్వాత తిరిగి ఏపీకి పయనం కానున్నారు.