News August 24, 2024

24 గంటల్లో భారీ వర్షాలు: వాతావరణశాఖ

image

వచ్చే 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. VZM, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉ.గోదావరి, KNL, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అటు TGలోని ఉమ్మడి ADB, KNR, RR, వికారాబాద్, సంగారెడ్డి, MBNR, నారాయణపేట, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Similar News

News July 9, 2025

యువీ ‘లక్ష్యం’ కోసం కదలిన తారలు

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఛారిటీ ‘YouWeCan’ కోసం క్రికెట్ సెలబ్రిటీలు తరలివచ్చారు. లండన్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సచిన్ టెండూల్కర్, అజిత్ అగార్కర్, కెవిన్ పీటర్సన్, రవిశాస్త్రి, విరాట్ కోహ్లీతోపాటు టీమ్ ఇండియా ఆటగాళ్లు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా క్యాన్సర్ రోగుల కోసం యువీ సామాజిక సేవ చేస్తున్న విషయం తెలిసిందే.

News July 9, 2025

APలో భారీ పెట్టుబడి: TDP

image

AP: దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ ప్లాంట్ రాష్ట్రంలో పెట్టేందుకు Syrma SGS Technology ముందుకొచ్చిందని టీడీపీ ట్వీట్ చేసింది. తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద రూ.1800 కోట్లతో ఈ ప్లాంట్ ఏర్పాటవుతుందని, 2027 మార్చి కల్లా అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. గత కొన్ని నెలలుగా ఈ సంస్థతో ప్రభుత్వం చర్చలు జరిపిందని, చంద్రబాబు, లోకేశ్ కృషి ఫలించిందని వివరించింది.

News July 9, 2025

విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తప్పిన ప్రమాదం

image

బిహార్ రాజధాని పట్నా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొనడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు అప్రమత్తమైన ఆ ఫ్లైట్‌ను తిరిగి పట్నా విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.