News March 19, 2024
ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో మోస్తరు వానలు

నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో 2 రోజులపాటు మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది.
Similar News
News August 25, 2025
6,589 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

SBIలో 6,589 జూనియర్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అభ్యర్థుల వయసు 20-28 ఏళ్లు ఉండాలి. డిగ్రీ చేసిన వారు అర్హులు. ఫైనలియర్ చదువుతున్న వారూ అప్లై చేయవచ్చు. కానీ DEC 31, 2025కి ముందు డిగ్రీ పాసై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, OBC, EWS కేటగిరీ విద్యార్థులకు ₹750. మిగతా వారికి లేదు.
వెబ్సైట్: <
News August 25, 2025
ఐదుగురు మెడికల్ విద్యార్థులు సస్పెండ్

TG: నిజామాబాద్ మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటనలో ఐదుగురు హౌస్ సర్జన్లపై చర్యలు తీసుకున్నారు. 6 నెలలు సస్పెండ్ చేయడంతో పాటు హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగించారు. ప్రిన్సిపల్ కృష్ణమోహన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదవడంతో పోలీసుల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. కాగా రాహుల్ అనే విద్యార్థిని సీనియర్లు వేధించగా, తిరిగి ప్రశ్నించడంతో అతడిని చితకబాదారు.
News August 25, 2025
AP, TGకి 18,900 మెట్రిక్ టన్నుల యూరియా

ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం 4 రాష్ట్రాలకు 30,491 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బిహార్‌కు 2,700, ఏపీకి 10,800, తెలంగాణకు 8,100, ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నులు కేటాయించింది. దీని వల్ల యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కాస్త ఉపశమనం లభించనుంది.