News May 11, 2024
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: రేపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు APSDMA తెలిపింది. ఉమ్మడి విజయనగరం, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవాళ అత్యధికంగా నంద్యాల(D) చాగలమర్రి, విజయనగరం(D) రాజాం, వైఎస్సార్(D) సింహాద్రిపురంలో 41.5 డిగ్రీలు, అల్లూరి(D) యెర్రంపేటలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.
Similar News
News December 16, 2025
విధ్వంసక ప్లేయర్.. రూ.కోటికే ముంబైకి

సూపర్ ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా విధ్వంసక ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. రూ.కోటి బేస్ ప్రైస్‌కు వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు కొనుగోలు చేసింది. ఇతడు గతంలోనూ ముంబై తరఫున ఆడారు. మరోవైపు స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగను రూ.2 కోట్లకు లక్నో, బెన్ డకెట్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకున్నాయి.
News December 16, 2025
TRAIలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<
News December 16, 2025
శనగలో ఇనుము లోప లక్షణాలు – నివారణ

సాధారణంగా సున్నపు నిల్వలు ఎక్కువగా ఉండి, ఉదజని సూచిక ఎక్కువ ఉన్న నేలల్లో నాటిన శనగ పంటలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపం వల్ల లేత ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండి రాలిపోతాయి. నేలలకు ఫెర్రస్ సల్ఫేట్ నేరుగా అందించడం అంత లాభదాయకం కాదు. కాబట్టి ప్రతి లీటరు నీటికి ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా, ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల తేడాతో రెండు సార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


