News August 15, 2024
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: రేపు పార్వతీపురం, అల్లూరి, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, నంద్యాల, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూ.గో , ప.గో , కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరులో తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది.
Similar News
News September 10, 2024
సైన్యం వద్దంటున్నా బైడెన్ వినలేదు: నివేదిక
అఫ్గానిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణ వద్దని అమెరికా మిలిటరీ, అఫ్గాన్ ప్రభుత్వం, నాటో సూచిస్తున్నా దేశాధ్యక్షుడు బైడెన్ లెక్కచేయలేదని US విదేశీ వ్యవహారాల కమిటీ నివేదిక వెల్లడించింది. ‘నిపుణులు, సలహాదారుల సూచనలన్నింటినీ బైడెన్ పెడచెవిన పెట్టారు. దేశ ప్రయోజనాల కంటే తన వ్యక్తిగత ప్రతిష్ఠే ముఖ్యమనుకున్నారు. తన నిర్ణయానికి ప్రజల మద్దతు కూడగట్టేందుకు అనేక అబద్ధాల్ని చెప్పుకొచ్చారు’ అని నివేదిక తెలిపింది.
News September 10, 2024
విరాట్ బెస్ట్ బ్యాటర్.. స్టెయిన్ బెస్ట్ బౌలర్: KL రాహుల్
తన దృష్టిలో విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాటర్ అని క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బౌలర్లలో డేల్ స్టెయిన్‌ను ఆడటం చాలా కష్టమని పేర్కొన్నారు. విరాట్, రోహిత్, సూర్య, బాబర్ ఆజం, ట్రావిస్ హెడ్ ప్రస్తుతం ఉత్తమ బ్యాటర్లని ఆయన అన్నారు. బౌలర్లలో స్టెయిన్, ఆండర్సన్, బుమ్రా, రషీద్, నసీమ్ షాలను అత్యుత్తమంగా భావిస్తానని పేర్కొన్నారు.
News September 10, 2024
వరద బాధితులకు ‘మేఘా’ సంస్థ భారీ విరాళం
AP: వరద బాధితులకు మేఘా సంస్థ రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుబ్బయ్య కలిసి అందించారు. అలాగే లలిత జ్యువెలరీ మార్ట్ అధినేత కిరణ్ రూ.కోటి సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆయన సీఎంకు ఇచ్చారు. జీఎంఆర్ సంస్థ రూ.2.5 కోట్ల విరాళం ఇచ్చింది.