News August 13, 2025

భారీ వర్షాలు.. సాయం కోసం అమిత్ షాకు కిషన్ రెడ్డి ఫోన్

image

TGలో భారీ వర్షాల నేపథ్యంలో సాయం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘రాష్ట్రానికి NDRF బృందాలను పంపాలని కోరాను. ఇప్పటికే వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉంచామని అమిత్ షా చెప్పారు. అవసరమైతే అదనపు బృందాలను పంపిస్తామన్నారు’ అని కిషన్ రెడ్డి వివరించారు. వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని BJP కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 15, 2026

నేడు నిజామాబాద్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక

image

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం మంత్రి నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2:45 గంటలకు నిజామాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు తిరుగు పయనవుతారు.

News April 15, 2026

రూ.5108 కోట్లతో పోలవరం R&R పనులు: CBN

image

AP: పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, నల్లమల సాగర్ లింక్, వరికపూడిశెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రూ.5108 కోట్లతో పోలవరం సివిల్, R&R పనులు చేపట్టాలని ఆదేశించారు. 38060 నిర్వాసిత కుటుంబాల్లో 16763 ఫ్యామిలీలను తరలించారని, మిగతా వారిని 2027 APRకల్లా తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు రూ.27,089 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు.