News September 8, 2024
భారీ వర్షాలు.. పరిస్థితిపై మంత్రి ఆరా
TG: మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీని మంత్రి సీతక్క ఆరా తీశారు. ఖమ్మం మున్నేరుకు వరద ప్రవాహం 14 అడుగులకు చేరింది. ఇప్పటికే వరద పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. మరోవైపు రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.
Similar News
News October 8, 2024
రేపు డబుల్ ధమాకా
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రేపు అరగంట వ్యవధిలో రెండు మ్యాచులు జరగనున్నాయి. సాయంత్రం 7 గంటలకు భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్‌తో రెండో టీ20 మ్యాచులో తలపడనుంది. మరోవైపు సా.7.30 గంటలకు మహిళా టీ20 ప్రపంచ కప్‌లో శ్రీలంకతో టీమ్ ఇండియా ఆడనుంది. సెమీస్ చేరాలంటే మహిళల జట్టుకు ఈ మ్యాచులో గెలుపు చాలా కీలకం. కాగా బంగ్లాతో తొలి టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
News October 8, 2024
కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు రూ.585 కోట్లు
ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల(ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం) అసెంబ్లీ ఎన్నికలకు రూ.585 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఈసీకి వివరాలను సమర్పించింది. యాడ్స్, మీడియా ప్రచారానికి రూ.410 కోట్లు, ఇతరత్రాలకు మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేసినట్లు తెలిపింది. కాగా కాంగ్రెస్ వద్ద డిపాజిట్ల రూపంలో రూ.170 కోట్లు ఉండగా వివిధ మార్గాల్లో రూ.539.37 కోట్లు వచ్చాయని పేర్కొంది.
News October 8, 2024
జగన్‌కు బీజేపీ ఎమ్మెల్యే సవాల్
AP: వైసీపీ చీఫ్ జగన్‌కు దమ్ముంటే తనపై జమ్మలమడుగులో పోటీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. స్థానిక వైసీపీ నేతలు తనకు సరితూగరని చెప్పారు. రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి ఇష్టారీతిగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సంక్రాంతి నాటికి రాజోలి జలాశయ నిర్మాణం, టిడ్కో ఇళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేరుస్తుందన్నారు.