News September 9, 2024

భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త

image

AP: వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖ, తూ.గో, ప.గో, అల్లూరి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరంలో గంటకు 40-50కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, తీరం వెంట 70కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. కళింగపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

Similar News

News October 5, 2024

టుడే హెడ్ లైన్స్

image

* లడ్డూ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం
* తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన CBN
* పరిపాలనలో బాబు ఫెయిల్: జగన్
* మోదీ డైరెక్షన్‌లో పవన్ నటన: షర్మిల
* TG: ధరణి స్థానంలో కొత్త చట్టం: మంత్రి పొంగులేటి
* సీఎం రేవంత్ మోసగాడు: హరీశ్ రావు
* సురేఖపై రూ.100 కోట్ల దావా వేస్తా: నాగార్జున
* ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మృతి

News October 5, 2024

చైనాలో ఏటా టన్నుల కొద్దీ పాములు స్వాహా!

image

చైనీయులు ఏటా ఏకంగా 10వేల టన్నులకు పైగా పాముల్ని స్వాహా చేస్తున్నారని ఆ దేశ వన్యప్రాణ సంరక్షణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా షాంఘై, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సుల్లో సర్పాలకు మహా డిమాండ్. ఒక్క షాంఘైలోనే 6వేల వరకూ పాము మాంసం హోటళ్లు ఉండటం గమనార్హం. తాచుపాముల నుంచి సముద్రపు పాముల వరకూ అన్నింటినీ చైనీయులు ఇష్టంగా తినేస్తారు. దీని వల్ల పర్యావరణ అసమతుల్యత తలెత్తే ప్రమాదం ఉందంటూ సంస్థ హెచ్చరించింది.

News October 5, 2024

గంభీర్ నా సోదరుడి లాంటివాడు: అక్మల్

image

టీమ్ ఇండియా కోచ్ గంభీర్, పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తరచూ గొడవ పడేవారన్న సంగతి తెలిసిందే. 2010లో ఆసియా కప్ సందర్భంగా ఒకరినొకరు సవాలు చేసుకోగా అంపైర్లు జోక్యం చేసుకుని విడిపించారు. అయితే అదంతా గ్రౌండ్ వరకేనని అక్మల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమ ఇద్దరికీ వివాదాలేవీ లేవని, ఆయన తనకు సోదరుడితో సమానమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరం మంచి స్నేహితులమని వివరించారు.