News July 22, 2024
భారీ వర్షాలు.. వారికి రూ.20వేలు ప్రకటించిన ప్రభుత్వం
TG: భద్రాద్రి(D) అశ్వారావుపేట సమీపంలో గండిపడిన పెద్దవాగు ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ‘అధికారుల నిర్లక్ష్యంతోనే గండి పడింది. సమయానికి గేట్లు ఎత్తి ఉంటే ప్రమాదం జరిగేది కాదు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. కొట్టుకుపోయిన గొర్రెలకు రూ.3వేలు, ఆవులు, గేదెలకు రూ.20వేలు ఇస్తాం. పత్తి, వరి పంటలు నష్టపోయిన వారికి ఉచితంగా విత్తనాలు ఇస్తాం’ అని ప్రకటించారు.
Similar News
News October 4, 2024
కొండా సురేఖను వదిలేది లేదు: అఖిల్
మంత్రి సురేఖను వదిలేది లేదని నటుడు అఖిల్ వార్నింగ్ ఇచ్చారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, అసభ్యకరం, జుగుప్సాకరం. సామాజిక విలువలు, సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన సిగ్గుచేటు, క్షమించరానిది. అమాయకులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలిపశువులను చేసింది. బాధిత కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఈ సమాజంలో అలాంటి వాళ్లకు స్థానం లేదు’ అని అఖిల్ ట్వీట్ చేశారు.
News October 4, 2024
Stock Marketలో యుద్ధ కల్లోలం.. నేడెలా మొదలయ్యాయంటే?
స్టాక్ మార్కెట్లు రేంజుబౌండ్లో ట్రేడవుతున్నాయి. నిన్నటి క్రాష్‌తో పోలిస్తే నేడు మోస్తరు నష్టాల్లోనే సూచీలు ఆరంభమయ్యాయి. విలువైన షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. BSE సెన్సెక్స్ 82,479 (-17), NSE నిఫ్టీ 25,237 (-12) వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో 24 కంపెనీలు లాభాల్లో, 25 నష్టాల్లో ఉన్నాయి. మారుతీ, ONGC, టైటాన్, SBI లైఫ్, BEL టాప్ గెయినర్స్.
News October 4, 2024
13న అలయ్ బలయ్.. చంద్రబాబు, రేవంత్‌కు ఆహ్వానం: విజయలక్ష్మి
TG: ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ‘అలయ్ బలయ్’ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. CMలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డితోపాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రమంత్రులు, అన్ని పార్టీల నేతలను ఆహ్వానించినట్లు ఆమె చెప్పారు. హరియాణా గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు.