News April 3, 2025

భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. నాగర్‌కర్నూల్(D) పదర(M) కూడన్‌పల్లి సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వర్షాల సమయంలో రైతులు, కూలీలు చెట్ల కింద ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో 2 రోజులు భారీ వర్షాలు పడతాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Similar News

News April 4, 2025

SRH బౌలింగ్ బాగానే ఉంది: కమిన్స్

image

KKRతో మ్యాచ్ ఓడిపోవడంపై SRH కెప్టెన్ కమిన్స్ స్పందించారు. బౌలింగ్ బాగానే ఉందని, కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేయడం వల్లే ఓడాల్సి వచ్చిందన్నారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా లేదని భావించి జంపాను ఆడించలేదని తెలిపారు. స్పిన్నర్లు బంతిని సరిగా గ్రిప్ చేయలేకపోయారని, అందుకే వాళ్లతో 3 ఓవర్లే వేయించినట్లు వివరించారు. మరోవైపు, స్పిన్నర్లను సరిగా ఉపయోగించకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయిందని విమర్శలు వస్తున్నాయి.

News April 4, 2025

తీవ్ర విషాదం.. బావిలో విషవాయువులు పీల్చి 8 మంది మృతి

image

మధ్యప్రదేశ్‌ కొండవాట్‌లో విగ్రహాల నిమజ్జనం కోసం పాడుబడ్డ బావిని శుభ్రం చేసేందుకు వెళ్లి 8 మంది మరణించారు. గంగౌర్ పండుగ నేపథ్యంలో 150 ఏళ్ల బావిని శుభ్రం చేసేందుకు తొలుత ఓ కూలీ బావిలోకి దిగాడు. బావిలోని విషవాయువులు పీల్చి మునిగిపోతుండగా అతడిని కాపాడేందుకు మిగిలిన కూలీలు అందులోకి దిగారు. ఇలా మొత్తం 8 మంది ప్రాణాలు వదిలారు. వారికి ఈత వచ్చినా విషవాయువులు పీల్చి నీటిలో మునిగిపోయారని అధికారులు తెలిపారు.

News April 4, 2025

సరికొత్త యుగానికి నాంది: ప్రధాని మోదీ

image

పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇది సరికొత్త యుగానికి నాంది అన్నారు. మద్దతు తెలిపిన ప్రజలు, చర్చల్లో పాల్గొన్న ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత లోపించిందన్నారు. ఇది ముస్లిం మహిళలు, పేదలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఇకపై ఈ పరిస్థితి మారుతుందని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యమిస్తామని ఉద్ఘాటించారు.

error: Content is protected !!