News April 3, 2025

భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. నాగర్‌కర్నూల్(D) పదర(M) కూడన్‌పల్లి సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వర్షాల సమయంలో రైతులు, కూలీలు చెట్ల కింద ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో 2 రోజులు భారీ వర్షాలు పడతాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Similar News

News April 24, 2025

హీరోయిన్ బేబీ బంప్(PHOTO)

image

ఇటీవల ప్రెగ్నెన్సీ ప్రకటించిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బేబీ బంప్‌తో కనిపించారు. నిన్న రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆమె ముంబైలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా కెమెరామెన్లు ఆమె ఫొటోలు తీయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై కియారా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. కాగా కియారా, సిద్ధార్థ్ 2023లో పెళ్లి చేసుకున్నారు.

News April 24, 2025

ఇంగ్లిష్‌లో మోదీ హెచ్చరికలు.. ఎందుకంటే..

image

PM మోదీ సాధారణంగా హిందీలోనే ప్రసంగిస్తుంటారు. కానీ ఈరోజు బిహార్‌లో మాత్రం ఇంగ్లిష్‌లో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంపై భారత్ చేయనున్న పోరాటం గురించి ప్రపంచానికి తెలిపేందుకే ఆయన ఇంగ్లిష్‌లో మాట్లాడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘బిహార్ గడ్డపై నిల్చుని ప్రపంచానికి చెబుతున్నా. ప్రతి ఉగ్రవాదిని పట్టుకుంటాం. భూమి అంచులకు వెళ్లినా వదిలే ప్రసక్తి లేదు’ అని PM అన్నారు.

News April 24, 2025

పాక్ నటుడి సినిమాపై నిషేధం

image

పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ సినిమాపై భారత సమాచార శాఖ నిషేధం విధించింది. 9 ఏళ్ల తర్వాత ఈ పాక్ నటుడు బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన క్రమంలో పహల్‌గామ్ ఉగ్రదాడి కలకలం రేపింది. ఈ నరమేధం వెనుక పాక్ హస్తం ఉందని తేల్చిచెప్పిన భారత్ పాక్ సినిమాలు, నటులపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మే 9న రిలీజ్ కావాల్సి ఉన్న సినిమా ఆగిపోయింది.

error: Content is protected !!