News January 31, 2025

ఆ పోస్టులకు ఎత్తు నుంచి మినహాయింపు

image

AP: RTCలో 2016-19 మధ్యకాలంలో చనిపోయిన 16మంది కండక్టర్ల కుటుంబాల నుంచి కారుణ్య నియామకాల కింద నియమితులవనున్న అభ్యర్థులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఎత్తు నిబంధనల్లో మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం 154 సెంటీమీటర్ల ఎత్తు ఉండాల్సి ఉండగా, ఆ ఎత్తు లేనివారిని ఇన్నాళ్లూ కొలువులకు తీసుకోలేదు. తాజా ఉత్తర్వులతో వారందరికీ ఊరట లభించనుంది.

Similar News

News February 26, 2025

చరిత్రలో ఈరోజు.. ఫిబ్రవరి 26

image

* 1802- ఫ్రెంచి నవలా రచయిత విక్టర్ హ్యూగో జననం
* 1829- బ్లూ జీన్స్‌ని తొలిసారి రూపొందించిన లెవీ స్ట్రాస్ అండ్ కో ఫౌండర్ లెవీ స్ట్రాస్ జననం
* 1932- సామాజిక కార్యకర్త హేమలతా లవణం జననం
* 1982- మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు పుట్టినరోజు
* 1962- ఉమ్మడి ఏపీ శాసనసభ మొదటి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు మరణం
* 1966- అతివాద స్వాతంత్ర్య సమరయోధుడు సావర్కర్ మరణం(ఫొటోలో)

News February 26, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 26, 2025

మహా శివరాత్రికి ఆ పేరెలా వచ్చింది?

image

ఈ సృష్టికి లయకారకుడైన పరమశివుడు లింగంగా ఆవిర్భవించిన రోజే మహా శివరాత్రి. మాఘమాసం బహుళ చతుర్ధశి రోజున ఆ ముక్కంటి శివలింగంగా ఆవిర్భవిస్తాడు. అయితే పురాణాల ప్రకారం శివరాత్రికి మరో కారణం కూడా ఉంది. క్షీరసాగర మథనం సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ బయటికి వచ్చే విషాన్ని పరమేశ్వరుడు తన గరళంలో నింపుకొని ముల్లోకాలను కాపాడుతాడు. ఇలా చేసిన ఆ కాళరాత్రే శివరాత్రి అని ప్రతీతి.

error: Content is protected !!