News February 17, 2025
పాములు, మొసళ్ల మధ్య నరకం.. డంకీ రూట్ బాధితుడు

అమెరికాకు వెళ్లే అడ్డదారి డంకీ రూట్ అనుభవాలను అక్రమ వలసదారుడు మన్‌దీప్ సింగ్ పంచుకున్నారు. ‘లీగల్‌గా అమెరికా తీసుకెళ్తానంటూ ఓ ఏజెంట్ రూ.40 లక్షలు, సబ్ ఏజెంట్ రూ.20 లక్షలు తీసుకున్నారు. 7 దేశాలగుండా 13 రోజులు నా ప్రయాణం జరిగింది. దారి మధ్యలో భయంకరమైన పాములు, మొసళ్లు, 12 నదులు దాటుకుంటూ వెళ్లాం. నేను సిక్కునని ఎవరూ గుర్తుపట్టకుండా గడ్డం తీసేశారు. రోటీలు, నూడిల్స్ తింటూ నడిచాం’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News March 18, 2025
అందుకే 24ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నా: పార్తీబన్

నటి సీతతో విడాకుల తర్వాత ఇప్పటివరకూ పెళ్లి చేసుకోలేదని నటుడు R.పార్తీబన్ అన్నారు. భార్యగా వేరొకరికి స్థానం ఇవ్వలేనని, అందుకే ఒంటరిగా ఉంటున్నానని ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. సీతతో ఇప్పుడు టచ్‌లో లేనని, ఆమె తల్లి చనిపోయినప్పుడు మాత్రం అంత్యక్రియలు జరిపానని అన్నారు. 1990లో వీరు వివాహం చేసుకోగా 2001లో విడాకులు తీసుకున్నారు. సీత 2010లో మరో పెళ్లి చేసుకుని 2016లో విడిపోయారు.
News March 18, 2025
అంతరిక్షం నుంచి వచ్చాక స్ట్రెచర్లపైనే బయటకు..

స్పేస్ ఎక్స్ క్రూ క్యాప్సుల్‌లో రేపు తెల్లవారుజామున భూమిపైకి రానున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌పై అందరి దృష్టి నెలకొంది. క్యాప్సుల్ తెరుచుకున్న వెంటనే వీరిని స్ట్రెచర్స్‌లో బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. స్పేస్ నుంచి ఒక్కసారిగా భూమిపైకి రావడం, అంతరిక్షంలో నెలల పాటు ఉండటంతో వీరి శరీరంలో మార్పులు చోటు చేసుకోవడం కారణమని నిపుణులు చెబుతున్నారు. వీరు నడవలేని స్థితిలో ఉంటారని అంటున్నారు.
News March 18, 2025
‘బుడమేరు’కు శాశ్వత పరిష్కారం: మంత్రి

AP: గతేడాది విజయవాడను ముంచేసిన బుడమేరు వాగుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు ప్రారంభించామని మంత్రి నిమ్మల తెలిపారు. ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నిధుల విడుదలకు మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు సరస్సు వరకు కాలువల ప్రవాహ మార్గం సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కులకు పెంచుతామన్నారు.