News April 3, 2024
పింఛన్లు తీసుకునేవారికి సహాయం అందించండి: పవన్

AP: పింఛన్లు తీసుకునేవారికి జనసేన నేతలు, కార్యకర్తలు సహాయం చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. ‘పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్లి పింఛన్ ఇప్పించండి. తర్వాత ఇంటి దగ్గర దింపి రండి. సామాజిక బాధ్యతగా సహాయం అందించండి. TDP, BJP నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.
Similar News
News April 20, 2025
GOVT ఉద్యోగాల్లో వారికి 3% రిజర్వేషన్లు

AP: ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్ను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో పతకాలు సాధిస్తే పోటీ పరీక్షలు లేకుండానే ఉద్యోగం ఇవ్వనుంది. అన్ని ప్రభుత్వ విభాగాలు, DSC, యూనిఫాం శాఖలకూ ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. గతంలో ఉన్న పదేళ్ల కాలపరిమితిని ఎత్తేసింది. అర్హత, వయసు ఉంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా పతకాలు సాధించిన వారంతా అర్హులే.
News April 20, 2025
వచ్చే సంక్రాంతికి అఖండ-2?

బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తున్న అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడనున్నట్లు సమాచారం. తొలుత ఈ ఏడాది సెప్టెంబర్ 25కి ప్లాన్ చేయగా ఆలోపు సినిమా షూటింగ్, VFX వర్క్స్ పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ యోచిస్తున్నట్లు టాక్. కాగా బాలయ్య- బోయపాటి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనే వార్తలను సినీ వర్గాలు <<16051406>>ఖండించిన<<>> విషయం తెలిసిందే.
News April 20, 2025
ఇవాళ బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

TG: 2025-26కు గాను BC గురుకుల స్కూళ్లలో ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్ల భర్తీకి ఇవాళ పరీక్ష జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 6,832 బ్యాక్లాగ్ సీట్లకు గాను 26,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 109 పరీక్ష కేంద్రాల్లో ఉ.10 గంటల నుంచి మ.12గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్టికెట్లు తీసుకెళ్లాలి. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదు.