News December 4, 2024

ఇకపై బ్యాంక్ అకౌంట్‌కు నలుగురు నామినీలు

image

బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుకు LS ఆమోదం తెలిపింది. దీని ద్వారా అకౌంట్ ఖాతాదారులు నలుగురు నామినీలను కలిగిఉండే వెసులుబాటు కల్పించారు. ఏకకాలంలో లేదా ఒకరి తర్వాత ఒక నామినీని ఎంచుకునే అవకాశం ఉంది. దీంతో పాటు పలు మార్పులు చేయనున్నారు. ఈ బిల్లును కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా సభ ఆమోదం తెలిపింది. కాగా ప్రస్తుత బ్యాంకు ఖాతాకు ఒకే నామినీకి అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.

Similar News

News February 18, 2026

శుభ ముహూర్తాలు వచ్చేశాయ్!

image

పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు వేళయింది. శుక్ర మౌఢ్యమి ముగిసి శుభ ముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు, జూన్‌లో 21-29 వరకు <<18903252>>మంచి ముహూర్తాలు<<>> ఉన్నాయి. మౌఢ్యమి కారణంగా గతేడాది నవంబర్ నుంచి శుభకార్యాలకు బ్రేక్ పడింది. ఇప్పుడు మౌఢ్యమి ముగిసినా తిథి, నక్షత్రం, దోషాలు, జాతకం తదితరాలను చూసుకొని శుభకార్యాలు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

News February 18, 2026

NCERTలో 117 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

NCERTలో 117 అకడమిక్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి గడువును పెంచారు. FEB 20 ఆఖరు తేదీ కాగా.. మార్చి 6 వరకు పొడిగించారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.LSc, NET/SET/SLET, PhD/M.Phil అర్హతతో పాటు టీచింగ్/ రీసెర్చ్ అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.57,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in

News February 18, 2026

యూట్యూబ్ డౌన్.. స్పందించిన టీమ్

image

ప్రపంచ వ్యాప్తంగా YouTube డౌన్ అయినట్లు ఆ కంపెనీ ధ్రువీకరించింది. లక్షలాది ఫిర్యాదుల మేరకు ట్విటర్ వేదికగా స్పందించింది. తమ సేవల పునరుద్ధరణకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు వివరించింది. ఈ ఉదయం 6.18గంటల నుంచి 7.33గంటల మధ్య యూట్యూబ్ పని చేయలేదు. అటు ప్రస్తుతం కొందరికి YouTube సేవలు అందుతుండగా మరికొందరు ఫోన్ లేదా వెబ్‌సైట్‌లో యాక్సెస్ చేయలేకపోతున్నారు.