News August 2, 2024
ఇకపై గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్లు

TG: రాష్ట్రంలోని 10,954 గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ల(JRO)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ సేవలు అందించేందుకు VRO, VRAలు ఉండేవారు. గత సర్కార్ ఆ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసి వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. ఇప్పుడు వారినే కాంగ్రెస్ ప్రభుత్వం JROలుగా నియమించనుంది. దీనివల్ల ఆర్థిక భారం తప్పడంతో పాటు కొత్తగా నియామక ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉండదు.
Similar News
News November 24, 2025
6GHz స్పెక్ట్రమ్ వివాదం.. టెలికం vs టెక్ దిగ్గజాలు

6GHz బ్యాండ్ కేటాయింపుపై రిలయన్స్ జియో, VI, ఎయిర్టెల్కి వ్యతిరేకంగా అమెరికన్ టెక్ దిగ్గజాలు ఏకం అయ్యాయి. మొత్తం 1200 MHzను మొబైల్ సేవల కోసం వేలానికి పెట్టాలని జియో కోరగా Apple, Amazon, Meta, Cisco, HP, Intel సంస్థలు ఈ బ్యాండ్ మొబైల్ సేవలకు సాంకేతికంగా సిద్ధంగా లేదని పేర్కొన్నాయి. పూర్తిగా వైఫై కోసం మాత్రమే ఉంచాలని TRAIకి సూచించాయి.
News November 24, 2025
‘భూ భారతి’లో భూముల మార్కెట్ విలువ!

TG: ‘భూ భారతి’ వెబ్సైట్లో భూముల మార్కెట్ విలువను తెలుసుకునేలా ప్రభుత్వం ఆప్షన్ తీసుకొచ్చింది. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ కోసం అధికారిక వెబ్సైట్లో తెలుగు, ఇంగ్లిష్లో ఈ సదుపాయాన్ని అందిస్తోంది. సర్వే నంబర్ ఉన్న ప్రతి ల్యాండ్ మార్కెట్ విలువ ఇందులో ఉంటుంది. ధరణి పోర్టల్లోని లోపాలను సరిదిద్దేందుకు ‘భూ భారతి’ని తీసుకొచ్చినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 24, 2025
‘స్థానిక‘ స్థానాలన్నిట్లో పోటీకి BJP సన్నాహం!

TG: పార్టీని అన్ని స్థాయుల్లో బలోపేతం చేసేలా BJP సిద్ధమవుతోంది. స్థానిక ఎన్నిలను దీనికి అవకాశంగా భావిస్తోంది. పంచాయతీ, MPTC, ZPTC, GHMCల పరిధిలోని డివిజన్లు, వార్డులతో సహా అన్ని చోట్లా పోటీకి దిగాలని నిర్ణయించినట్లు పార్టీ నాయకుడొకరు వివరించారు. ‘దీనివల్ల పార్టీకి ఓటు బ్యాంకు గతంలో కన్నా భారీగా పెరిగే అవకాశముంది. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగకున్నా కార్యకర్తలనే నిలబెడతాం’ అని తెలిపారు.


