News March 12, 2025

ఆమె అరెస్ట్ నిర్బంధ పాలనకు పరాకాష్ఠ: KTR

image

TG: మహిళా జర్నలిస్ట్ రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఓ రైతు కష్టాల వీడియోను పోస్ట్ చేస్తే అరెస్ట్ చేయడం నిర్బంధ పాలనకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. ప్రజాపాలనలో మీడియాకు స్వేచ్ఛ లేదని, రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు. రేవతి అరెస్ట్‌ను హరీశ్ రావు కూడా ఖండించారు.

Similar News

News November 11, 2025

మల్లోజుల, తక్కళ్లపల్లి రాజకీయ ద్రోహులు: అభయ్

image

TG: ఇటీవల లొంగిపోయిన సీనియర్ మావోలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావును ‘రాజకీయ ద్రోహులు’గా పేర్కొంటూ మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ లేఖ విడుదల చేశారు. వీరిద్దరూ MH, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో ముందస్తు ఒప్పందం చేసుకున్నారని, వారికి మావోయిస్టు పంథాను తప్పుబట్టే హక్కులేదని మండిపడ్డారు. దివంగత మావోయిస్టు నేత నంబాల కేశవరావు ఆయుధాలు విడిచిపెట్టాలని ఎప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు.

News November 11, 2025

కొవిడ్ లాక్‌డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

image

కరోనా లాక్‌డౌన్‌ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్‌లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్‌కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.

News November 11, 2025

ఇతిహాసాలు క్విజ్ – 63

image

ఈరోజు ప్రశ్న: సూర్యపుత్రుడు అయిన కర్ణుడిని గురువైన పరశురాముడు ఎందుకు శపించాడు? ఏమని శపించాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>