News November 8, 2024
ICC మెన్స్ ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి!
బౌలింగ్ కేటగిరీలో టెస్టుల్లో రబాడ, వన్డేల్లో కేశవ్ మహరాజ్, T20ల్లో రషీద్ నం.1 స్థానంలో ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో టెస్టుల్లో జడేజా, వన్డేల్లో మహ్మద్ నబీ, T20ల్లో లివింగ్‌స్టోన్ తొలి ర్యాంకును పొందారు. బ్యాటింగ్‌లో టెస్టుల్లో జోరూట్, వన్డేల్లో బాబర్, T20ల్లో హెడ్ ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో వన్డే, T20ల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉండగా టెస్టుల్లో ఆస్ట్రేలియా 124 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది.
Similar News
News December 9, 2024
నా ఆనవాళ్లు చెరపాలనుకుంటారా?: KCR
TG: రాజకీయ స్వార్థం, తనపై కక్షతో కాంగ్రెస్ నేతలు పిచ్చిపనులకు పూనుకోవడం శోచనీయమని BRS అధినేత KCR అన్నారు. ‘నా ఆనవాళ్లు లేకుండా చేయాలనే మూర్ఖపుతనంతో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. రేపటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించడం వెనక అసలు కోణం, ఉద్దేశం ఏదైనా వచ్చిన వారిని గౌరవించా. భోజనం పెట్టా. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు నేను పునాది వేయలేదా? రైతుబంధు ప్రారంభించలేదా?’ అని ఆయన ప్రశ్నించారు.
News December 9, 2024
12 నెలల్లో 12 ఏళ్ల వ్యతిరేకత: కిషన్ రెడ్డి
TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే 12 ఏళ్ల వ్యతిరేకతను ఎదుర్కొంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాలనలో BRSకు కాంగ్రెస్‌కు తేడా లేదని చెప్పారు. ప్రజల బతుకు పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందన్నారు. రేవంత్ పాలనకు పాస్ మార్కులిచ్చే పరిస్థితే లేదని విమర్శించారు. ఒక్క రేషన్ కార్డు, ఇల్లు కూడా ఇవ్వలేని వారు విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు.
News December 9, 2024
శాంతిభద్రతలే ఆప్ ఎన్నికల అజెండా!
ఢిల్లీలో లా అండ్ ఆర్డర్‌ను ఆప్ ఎన్నికల అజెండాగా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన వరుస హత్యలు, వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ అంశాల చుట్టూ ఆప్ నెరేటివ్ బిల్డ్ చేస్తోంది. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం శాఖ డైరెక్షన్‌లో పనిచేస్తారు కాబట్టి అమిత్ షాను టార్గెట్ చేస్తోంది. చైన్, ఫోన్ స్నాచింగ్, ఎక్స్‌టార్షన్స్, మహిళ్లలో అభద్రతా భావానికి కేంద్రం వైఫల్యాలే కారణమంటూ విమర్శిస్తోంది.