News August 12, 2025
APLలో ఇవాళ్టి మ్యాచులు ఇవే

AP: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్4 సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. నిన్న మొదటి మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్‌పై అమరావతి రాయల్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లైన్స్‌పై కాకినాడ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ మధ్యాహ్నం 1.30 గం.కు భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సా.6.30గం.కు విజయవాడ సన్ షైనర్స్, సింహాద్రి వైజాగ్ లైన్స్ తలపడనున్నాయి.
Similar News
News August 12, 2025
అందుబాటులోకి రాని టికెట్లు.. ఏ సినిమా కోసం వెయిటింగ్?

ఎన్టీఆర్, హృతిక్ నటించిన ‘వార్-2’, రజినీకాంత్ నటించిన ‘కూలీ’ రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి. అయినా ఈ సినిమాలకు సంబంధించి టికెట్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. టికెట్ల ధరలు పెంపు, తొలి రోజు షో టైమింగ్స్‌పై స్పష్టత రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీనిపై ఇవాళ సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?
News August 12, 2025
డీఎస్సీ ఫలితాలు.. అభ్యర్థులకు అలర్ట్

AP: మెగా DSC <<17374210>>ఫలితాలు<<>> నిన్న రాత్రి విడుదలయ్యాయి. DSC నార్మలైజేషన్, టెట్ వెయిటేజీ మార్కులు కలిపి విద్యాశాఖ ఫలితాలను ప్రకటించింది. టెట్ మార్కులపై అభ్యంతరాలుంటే అప్డేట్ చేసుకునేందుకు ఇవాళ, రేపు అవకాశం కల్పించింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత సవరించిన తుది మార్కులను రిలీజ్ చేయనుంది. అనంతరం జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి పోస్టులు, రిజర్వేషన్ల ప్రకారం ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడించే ఛాన్స్ ఉంది.
News August 12, 2025
ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 5 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ APలోని ఉమ్మడి ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారముందని పేర్కొంది. అటు TGలోనూ HYD, KNR, MHBD, మహబూబ్ నగర్, NLG తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది.