News December 4, 2024

ఇక్కడ అబ్బాయిలు గిన్నెలు తోమి, వంటలు చేయాలి

image

అమ్మాయిలు ఇంటి పని చేయాలని, అబ్బాయిలు బయట ఆడుకోవచ్చనే కోణాన్ని పిల్లల నుంచి తొలగించేందుకు చెన్నై కార్పొరేషన్ ముందుకొచ్చింది. వారికి లింగ సమానత్వాన్ని నేర్పించేందుకు జెండర్ ఈక్వాలిటీ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఇంట్లో పనులు, గిన్నెలు తోమడం, వంట చేయడం వంటివి నేర్పుతారు. అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో చెప్తారు. చిన్నప్పుడే పిల్లల ఆలోచనా విధానం మార్చితే మార్పులొస్తాయని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Similar News

News February 8, 2026

ఫోలిక్ యాసిడ్ అందరికీ అవసరమే

image

ఫోలిక్ యాసిడ్ గర్భిణులకే కాక అందరికీ అవసరమేనంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఫోలిక్ యాసిడ్ వల్ల పెద్దపేగు, గర్భాశయ, క్లోమ గ్రంథి క్యాన్సర్లు, అల్జీమర్స్ రాకుండా ఉంటాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఆకుకూరలు, చిక్కుడు జాతి గింజ‌లు, ప‌ప్పులు, సిట్రస్ ఫ్రూట్స్, ట‌మాటా, మ‌ట‌న్ లివ‌ర్‌, బ్రౌన్ రైస్‌, ప‌ల్లీలు, పుట్ట‌గొడుగులు, బొప్పాయి, క్యారెట్లు, బీట్ రూట్‌, ప‌చ్చి బ‌ఠానీల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.

News February 8, 2026

చీనీ తోటలకు కలుపు మందులతో ముప్పు

image

చీనీ తోటల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల వల్ల చెట్లలో వైరస్ ముప్పు పెరుగుతోంది. దీని వల్ల ఎండు తెగులు, వేరుకుళ్లు, పొలుసు పురుగు, నల్లి, మంగు, బంక తెగులు లాంటి చీడపీడలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కలుపు మందులతో తోటల జీవితకాలం తగ్గడంతో పాటు చెట్లు చనిపోతున్నట్లు వ్యవసాయ నిపుణులు గుర్తించారు. ట్రాక్టర్ లేదా కూలీలతో కలుపు తీయిస్తే భూమి గుల్లబారి పంటకు మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.

News February 8, 2026

US వీసా టెన్షన్: డాలర్ డ్రీమ్స్‌లో ‘డార్క్’ డేస్!

image

USలో సెటిల్ అవ్వాలనే డ్రీమ్‌తో వెళ్లిన ఇండియన్స్‌కు వీసా కష్టాలు వెంటాడుతున్నాయి. H1B ఎక్స్‌టెన్షన్స్ పై నిఘా పెరగడం, వీసా స్లాట్లు కూడా దొరక్కపోవడంతో ముఖ్యంగా F-1 స్టూడెంట్స్ భవిష్యత్తు గందరగోళంగా మారింది. దశాబ్దాల తరబడి సాగుతున్న గ్రీన్ కార్డ్ వెయిటింగ్, జాబ్ పోతే స్టేటస్ పోతుందనే భయం వంటివి తీవ్రమైన మెంటల్ ప్రెజర్‌కు దారితీస్తున్నాయి. కొందరు పెళ్లి ప్లాన్స్ కూడా వాయిదా వేసుకుంటున్నారు.