News February 8, 2025

హీరోకు అరుదైన వ్యాధి.. కామెంట్స్ వైరల్

image

తాను పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధితో బాధపడినట్లు హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. దాని నుంచి కోలుకునేందుకు 7-8 ఏళ్లు పట్టినట్లు వెల్లడించారు. స్టార్ డమ్ ఎంజాయ్ చేయాల్సిన రోజుల్లో ఈ వ్యాధితో ఇబ్బందులు పడినట్లు చెప్పారు. ఫ్యాన్స్ తనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే తనకు టెన్షన్ వచ్చేదని తెలిపారు. ఈ విషయమై డాక్టర్లను సంప్రదిస్తే దీని గురించి బయటపడిందన్నారు.

Similar News

News March 24, 2025

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు: ఏసర్ ఇండియా

image

తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో ఓ పెయిడ్ లీవ్ ఇవ్వనున్నట్లు ఏసర్ ఇండియా వెల్లడించింది. మాతృక పేరిట ప్రతి నెలా ఈ సెలవును అందిస్తామని తెలిపింది. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. L&T, స్విగ్గీ, జొమాటో కూడా ఈ తరహా లీవ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. బిహార్, ఒడిశా, సిక్కిం, కేరళ ప్రభుత్వాలు సైతం ఈ సెలవును అమలు చేస్తున్నాయి.

News March 24, 2025

విమానం లేటైనా, రద్దైనా టికెట్ డబ్బులు వాపస్..

image

విమాన ప్రయాణికుల ముఖ్యమైన <<15872009>>హక్కులు<<>> * షెడ్యూలుకు 2వారాల నుంచి 24hrs లోపు రద్దయితే ప్రత్యామ్నాయ ఏర్పాటు లేదా డబ్బు పొందొచ్చు * అన్నీ సవ్యంగా ఉన్నా బోర్డింగ్‌ను నిరాకరిస్తే డబ్బు పొందొచ్చు * ఫ్లయిట్ 6hrs లేటైతే ప్రత్యామ్నాయ ఏర్పాటు లేదా పరిహారం, భోజనం పొందొచ్చు. 24hrs అయితే వసతి పొందొచ్చు. * లగేజ్ పోతే KGకి ₹3K, డ్యామేజ్ అయితే ₹1K వరకు పొందొచ్చు * ప్రమాదంలో చనిపోతే/గాయపడితే ₹20L పరిహారం వస్తుంది.

News March 24, 2025

శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు

image

AP: విశాఖ చినముషిడివాడలోని శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ భూమిలో ఉన్న 9 శాశ్వత కట్టడాలను వారంలోగా తొలగించాలని ఆదేశించింది. లేదంటే తామే చర్యలు తీసుకుంటామని, తొలగింపు ఖర్చును మఠం నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది.

error: Content is protected !!