News October 7, 2024

రేపు కోర్టుకు హీరో నాగార్జున

image

TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. తన స్టేట్‌మెంట్ తెలిపేందుకు రేపు కోర్టుకు రావాలని న్యాయస్థానం నాగార్జునను ఆదేశించింది. ఈమేరకు విచారణను రేపటికి వాయిదా వేసింది.

Similar News

News November 7, 2024

ఓర్రీతో TRUMP ఫొటో దిగాల్సిందే.. అంటున్న నెటిజన్లు

image

సెలబ్రిటీలు తరచూ ఫొటోలు దిగే ఓర్రీ US ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఓటేశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తన US సిటిజెన్‌షిప్‌కు సంబంధించిన పత్రాలను కూడా షేర్ చేశారు. ‘మనం సాధించాం ట్రంప్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అదే పోస్టులో ట్రంప్ తనకు మెసేజ్ చేసినప్పుడు తీసిన స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు. కాగా ట్రంప్ వచ్చి ఓర్రీతో ఫొటో దిగాల్సిందేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

News November 7, 2024

రోహిత్‌ కెప్టెన్సీ కొనసాగించాల్సిందే: ఫించ్

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండని నేపథ్యంలో ఆ సిరీస్ అంతటికీ కొత్త కెప్టెన్‌ను నియమించాలని గవాస్కర్ ఇటీవల పేర్కొన్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫించ్ ఆ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ‘రోహిత్ భారత్‌కి కెప్టెన్. బిడ్డ పుట్టే సందర్భాన్ని ఎంజాయ్ చేసే హక్కు అతడికి కచ్చితంగా ఉంటుంది. తిరిగి వచ్చాక అతడే మళ్లీ కెప్టెన్‌గా ఉండాలి’ అని స్పష్టం చేశారు.

News November 7, 2024

ఆ దేశంలో బిచ్చగాళ్లే ఉండరు!

image

మన పొరుగు దేశం భూటాన్‌లో నిలువ నీడ లేనివారు, బిచ్చగాళ్లు ఏమాత్రం కనిపించరు. ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో క్రమం తప్పకుండా చోటు సంపాదించే అక్కడ ప్రజల అవసరాల్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. వారికి నివాసం, భూమి, ఆహార భద్రత వంటివన్నీ చూసుకుంటుంది. దీంతో ఇతర దేశాల్లో కనిపించే సహజమైన సమస్యలు ఇక్కడ కనిపించవు. అన్నట్లు ఇక్కడ వైద్య చికిత్స ఉచితం కావడం విశేషం.