News June 20, 2024

తమిళనాడు ప్రభుత్వానికి హీరో విశాల్ విజ్ఞప్తి

image

కల్తీ మద్యం తాగి తమిళనాడు రాష్ట్రంలో 30+ మంది ప్రాణాలు కోల్పోవడంపై హీరో విశాల్ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. ‘కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీ మద్యం సేవించి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతుండటం విషాదాన్ని నింపింది. తమిళనాడులో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. అందువల్ల సీఎం స్టాలిన్ గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు మద్యం షాపుల సంఖ్యను క్రమంగా తగ్గించడంపై దృష్టిపెట్టాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 9, 2024

ఎంపాక్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

image

దేశంలో తొలిసారి ఎంపాక్స్‌ అనుమానితుడిని గుర్తించడంతో కేంద్రం రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఎంపాక్స్‌పై ప్ర‌జ‌ల్లో అన‌వ‌స‌ర భ‌యాలు లేకుండా అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించింది. జిల్లాల్లో ప్ర‌జారోగ్య సౌక‌ర్యాల స్థాయిపై స‌మీక్షించాల‌ని, అనుమానితుల గుర్తింపు-ఐసోలేష‌న్ ఏర్పాట్లపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. కేసులు నమోదు కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది.

News September 9, 2024

పారాలింపియన్ల అంకితభావం స్ఫూర్తిదాయకం: జగన్

image

పారిస్‌ పారాలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లకు, పతక విజేతలకు వైసీపీ చీఫ్ జగన్ అభినందనలు తెలిపారు. పారాలింపియన్ల అంకితభావం, ప్రతిభ అద్భుతమని, స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వారిని చూసి దేశం గర్విస్తోందన్నారు. తాజాగా ముగిసిన పారాలింపిక్స్‌లో భారత్ 29(గోల్డ్ 7, సిల్వర్ 9, బ్రాంజ్ 13) పతకాలు సాధించిన విషయం తెలిసిందే.

News September 9, 2024

విధి వెక్కిరించినా భార్య తోడైంది!

image

పారాలింపిక్స్‌లో నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు చెందిన హోకాటో హోటోజే సెమా కాంస్య పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే. రైతు కుటుంబంలో జన్మించిన సెమా బాంబు పేలుడులో కాలు కోల్పోయినా ఆత్మవిశ్వాసం వీడలేదు. సతీమణి సహకారంతో తన కల సాకారం చేసుకున్నారు. ఆమె వల్లే మెడల్ గెలిచానని ఆయన పేర్కొన్నారు. తన భార్య ఎంతో త్యాగం చేసిందని, ఆమె ఆకలితో ఉండి తనకు ఆహారం పెట్టడం వల్లే శిక్షణ కొనసాగించినట్లు సెమా తెలిపారు.