News January 12, 2025
తన ఆరోగ్యంపై స్పందించిన హీరో విశాల్

తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రస్తుతానికి ఎలాంటి సమస్యల్లేవని హీరో విశాల్ చెప్పారు. ‘మా నాన్న ఇచ్చిన ధైర్యం వల్లే జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా. నేను పని నుంచి తప్పించుకుంటానని, 3-6 నెలలకోసారి సినిమాల నుంచి రెస్ట్ తీసుకుంటానని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నా చేతులు వణకట్లేదు. అంతా బాగానే ఉంది’ అని “మద గజ రాజు” ప్రీమియర్ షోలో వ్యాఖ్యానించారు.
Similar News
News February 20, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోయినా రోహితే కెప్టెన్: కైఫ్

‘ఛాంపియన్స్ ట్రోఫీ’ని భారత్ గెలుచుకోలేకపోయినా సరే 2027 వరల్డ్ కప్ వరకూ రోహిత్ శర్మనే భారత కెప్టెన్‌గా కొనసాగించాలని మాజీ క్రికెటర్ కైఫ్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ సాధించిన ఘనతలు అందరూ సాధించలేరు. టీమ్ ఇండియాను 2023 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చారు. వన్డే ఫార్మాట్లో ఆయన ఆటను, కెప్టెన్సీని ఎవరూ ప్రశ్నించలేరు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌గా రోహిత్ గెలుపు శాతం అద్భుతం’ అని గుర్తుచేశారు.
News February 20, 2025
జెలెన్‌స్కీ ఓ నియంత: ట్రంప్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘ఉక్రెయిన్‌లో ఎన్నికల్ని నిర్వహించకుండా నియంతలా వ్యవహరిస్తున్నారు. స్వదేశంలో ఆయనకు ప్రజాదరణ అంతంతమాత్రంగానే ఉంది. అందుకే ఎన్నికల్ని కూడా జరగనివ్వడం లేదు’ అని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్ట్ పెట్టారు. 2019లో అధ్యక్షుడిగా ఎన్నికైన జెలెన్‌స్కీ పదవీకాలం ముగిసిపోయినా యుద్ధం పేరు చెప్పి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
News February 20, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.