News May 11, 2024
హనుమాన్ విలన్‌తో హీరోయిన్ లవ్?

హనుమాన్ సినిమాలో విలన్‌గా చేసిన వినయ్ రాయ్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. హీరోయిన్ విమలా రామ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల వీరిద్దరూ చేసిన ట్రెండీ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రేమాయణంపై వీరు అధికారికంగా ప్రకటించలేదు. విమలా రామన్ తెలుగులో ఎవరైనా ఎపుడైనా, గాయం-2, చట్టం, నువ్వా నేనా, రాజ్, డామ్ 999 తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.
Similar News
News February 19, 2025
‘X’ ప్రీమియం+ ధరలు రెట్టింపు

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ ప్రీమియం+ ధరలు రెట్టింపు అయ్యాయి. మస్క్‌కు చెందిన AI సంస్థ XAI గ్రోక్-3 సేవల్ని అందుబాటులోకి తెచ్చి ధరల్ని పెంచింది. యూజర్లు ఈ AI మోడల్ ఫీచర్స్ వాడాలంటే ‘X’లో ప్రీమియం+ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఈ ధర నెలకు రూ.1750 ఉండగా.. రూ.3,470కి పెంచింది. ఏడాది ప్లాన్ రూ.18,300 నుంచి రూ.34,340కి చేరింది. 2023లో ‘X’ ప్రీమియం+ సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.1300 ఉండేది.
News February 19, 2025
CMRF చెక్కుల పంపిణీకి ఈసీ బ్రేక్

TG: రాష్ట్రంలో CMRF నిధుల విడుదలకు ఎలక్షన్ కమిషన్ బ్రేకులు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో మార్చి 4 వరకు లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేయవద్దని స్పష్టం చేసింది. కాగా తెలంగాణలోని 33 జిల్లాలకు 24 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అన్ని జిల్లాల్లో చెక్కుల పంపిణీ నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది.
News February 19, 2025
‘ఆరెంజ్’ ఫ్లాప్‌పై నెటిజన్ ట్వీట్.. డైరెక్టర్ రిప్లై!

రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమాను అప్పట్లో ఫ్లాప్ చేయడంపై ఓ నెటిజన్ మండిపడ్డారు. ‘అప్పుడు హిట్ చేసే వయసు మాకు రాలేదు. ఇంకో 50, 100 ఏళ్ల తర్వాత కూడా ఆరెంజ్ సినిమా క్లాసిక్’ అని రాసుకొచ్చాడు. దీనిపై డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ స్పందించారు. ‘చాలా థాంక్స్. సినీ పరిశ్రమ జీవితంలో అంతర్లీనం. కేవలం కొన్ని భావోద్వేగాలను చూపించాలనుకున్నా. కాబట్టి నాకు ఎటువంటి విచారం లేదు’ అని తెలిపారు.