News December 5, 2024
రేవతి మృతిపై స్పందించిన హీరోయిన్ రష్మిక

సంధ్య థియేటర్ వద్ద నిన్న జరిగిన <<14793383>>తొక్కిసలాటలో అభిమాని<<>> రేవతి మృతి చెందడంపై హీరోయిన్ రష్మిక స్పందించారు. ఇలాంటి ఘటన జరిగినందుకు చింతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అంతకుముందు మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిన్న సంధ్యలో ప్రీమియర్ షోను అల్లు అర్జున్‌తో కలిసి రష్మిక చూశారు. కాగా ఈ ఘటనలో గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.
Similar News
News January 15, 2026
పండుగ వేళ ఖాతాల్లోకి డబ్బులు

AP: సంక్రాంతి వేళ ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో డబ్బులు జమవుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న DA, డీఆర్ ఎరియర్లు, సరెండర్ లీవుల మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5.70లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని ఆర్థిక శాఖ చెబుతోంది. ఒక్కో ఉద్యోగికి రూ.70వేల నుంచి రూ.80వేల వరకు అకౌంట్లో పడుతున్నట్లు సమాచారం. పలువురు కాంట్రాక్టర్లకూ పెండింగ్ బిల్లులు రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
News January 15, 2026
తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

TG: BRS సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై SR నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన సికింద్రాబాద్‌లో జరిగిన ఓ ప్రోగ్రాంలో ‘సికింద్రాబాద్‌ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం’ అని CM రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత రవి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా FIR ఫైల్ చేశారు.
News January 15, 2026
‘ఈసారి బులెట్ మిస్ అవ్వదు’.. ట్రంప్‌కు హెచ్చరిక

ఇరాన్ ప్రభుత్వానికి చెందిన టీవీ ఛానెల్ (Islamic Republic State TV) ట్రంప్‌కు హెచ్చరికలు చేస్తూ సంచలన ప్రసారాలు చేసింది. 2024 ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం దృశ్యాలను టెలికాస్ట్ చేస్తూ, ‘ఈసారి బులెట్ మిస్ అవ్వదు’ అంటూ హెచ్చరించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రసారం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దీనిపై ఆ దేశ అధికారులు స్పందించలేదు.


