News November 15, 2024
హీరో విడాకుల కేసు.. కోర్టు ఏమందంటే?

హీరో జయం రవి, ఆర్తి విడాకుల కేసుపై చెన్నై కోర్టులో విచారణ జరిగింది. రవి నేరుగా కోర్టుకు రాగా ఆర్తి వర్చువల్‌గా హాజరయ్యారు. ఇరువురి లాయర్ల వాదనలు విన్న న్యాయస్థానం మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని చెప్పింది. రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని సూచించింది. విడిపోవడమే సబబు అనుకుంటే కచ్చితమైన కారణాన్ని తెలియజేయాలని పేర్కొంది. కాగా 2009లో పెళ్లి చేసుకున్న రవి, ఆర్తికి ఇద్దరు పిల్లలున్నారు.
Similar News
News December 3, 2025
TODAY HEADLINES

⋆ చేనేత, పవర్ లూమ్స్‌కు ఫ్రీ కరెంట్ : CM CBN
⋆ పదేళ్లు అధికారమిస్తే రాష్ట్రాన్ని నం.1 చేస్తాం: CM రేవంత్
⋆ పవన్ కళ్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యలపై TG మంత్రుల ఆగ్రహం.. వ్యాఖ్యలను వక్రీకరించొద్దన్న జనసేన
⋆ TG: ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
⋆ పీఎంవో పేరు ‘సేవాతీర్థ్’గా మార్పు
⋆ రెండు దశల్లో జనగణన: కేంద్రం
⋆ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదు: కేంద్రం
News December 3, 2025
చెక్-ఇన్‌లో టెక్నికల్ గ్లిచ్.. విమానాలు ఆలస్యం

సాంకేతిక సమస్యల వల్ల విమానాల రాకపోకల్లో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా ఎయిర్‌పోర్టుల్లోని చెక్-ఇన్ వ్యవస్థలో టెక్నికల్ గ్లిచ్ వల్ల దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటన విడుదల చేసింది. సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు శ్రమిస్తున్నట్లు పేర్కొంది. చెక్-ఇన్ ప్రాబ్లమ్‌తో ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు బారులుతీరారు. విమానాల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News December 3, 2025
ప్రకటనే పవన్ సమాధానమా?

తెలంగాణకు పవన్ <<18446578>>క్షమాపణలు<<>> చెప్పాలన్న డిమాండ్ల నేపథ్యంలో జనసేన నుంచి వెలువడిన <<18451648>>ప్రకటన<<>> చర్చనీయాంశమైంది. ఇదే ఆయన సమాధానమా? ప్రత్యేకంగా మాట్లాడరా? ప్రకటనతో వివాదం ముగుస్తుందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు Dy.CM హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతగా మాట్లాడాలని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వివాదానికి ఆయన త్వరగా ముగింపు పలకాలని సూచిస్తున్నారు.


