News November 15, 2024

హీరో విడాకుల కేసు.. కోర్టు ఏమందంటే?

image

హీరో జయం రవి, ఆర్తి విడాకుల కేసుపై చెన్నై కోర్టులో విచారణ జరిగింది. రవి నేరుగా కోర్టుకు రాగా ఆర్తి వర్చువల్‌గా హాజరయ్యారు. ఇరువురి లాయర్ల వాదనలు విన్న న్యాయస్థానం మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని చెప్పింది. రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని సూచించింది. విడిపోవడమే సబబు అనుకుంటే కచ్చితమైన కారణాన్ని తెలియజేయాలని పేర్కొంది. కాగా 2009లో పెళ్లి చేసుకున్న రవి, ఆర్తికి ఇద్దరు పిల్లలున్నారు.

Similar News

News December 8, 2024

ఈ ఆరోపణలకు సమాధానం చెప్పు చంద్రబాబు: VSR

image

AP: విశాఖలో దొరికిన కంటైనర్‌లో డ్రగ్స్ లేవని <<14811211>>సీబీఐ <<>>నిర్ధారించడంపై వైసీపీ ఎంపీ విజయసాయి స్పందించారు. ‘చంద్రబాబు కుట్ర రాజకీయాల్లో భాగంగా విశాఖ కంటైనర్‌లో డ్రగ్స్ దొరికిందని పోలింగ్‌కు నెలన్నర ముందు ఓటర్లను మోసం చేశాడు. బ్రెజిల్ అధ్యక్షుడికి, నాకు లింక్ పెట్టి మరీ అప్పుడు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు నాపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పు చంద్రబాబు’ అని VSR డిమాండ్ చేశారు.

News December 8, 2024

కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పు

image

AP: ఈ నెల 10, 11 తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో జరుగుతుందని మంత్రులు, అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. అమరావతిలోని సచివాలయంలో 11న ఉదయం 11.గంటలకు సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపింది. 12న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి విజన్ డాక్యుమెంట్లను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.

News December 8, 2024

సోనియా గాంధీపై బీజేపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

image

NDA ప్రభుత్వాన్ని అస్థిర‌ప‌రిచే కుట్ర‌లు జ‌రుగుతున్నాయంటూ అమెరిక‌న్ సంస్థ‌లు, జార్జ్ సోరోస్‌, రాహుల్ గాంధీపై ఆరోప‌ణ‌లు చేస్తున్న BJP తాజాగా సోనియా గాంధీని టార్గెట్ చేసింది. క‌శ్మీర్‌ను స్వ‌తంత్ర దేశంగా భావించే FDL-AP ఫౌండేష‌న్‌కు జార్జ్ సోరోస్ నుంచి నిధులు అందాయని, దీనికి సోనియా కో-ప్రెసిడెంట్ అని ఆరోపించింది. ఇది దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో విదేశీ హ‌స్తం ఉందనడానికి రుజువని పేర్కొంది.