News April 3, 2024
అరే ఏంట్రా ఇది.. ఉబర్ ఆటో బుక్ చేస్తే రూ.3 కోట్ల బిల్!

ఉబర్ ఆటో బుకింగ్స్‌లో నెలకొన్న సాంకేతిక లోపం వినియోగదారులను ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే నోయిడాలో ఓ వ్యక్తికి రూ.7 కోట్లు, బెంగళూరులో రూ.1 కోటి బిల్ వచ్చిన ఘటనలు వార్తల్లో నిలిచాయి. తాజాగా పుణేకు చెందిన దీపాంత్ ప్రశాంత్ అనే వ్యక్తి ఆటో రైడ్ పూర్తయిన తర్వాత రూ.3కోట్ల బిల్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇది సాంకేతిక లోపమైనప్పటికీ, బిల్లు భారం వారిపై పడుతుందేమోనని డ్రైవర్లు కంగారు పడుతున్నారని ఆయన తెలిపారు.
Similar News
News April 18, 2025
IPL: RCBకి బిగ్ షాక్

పంజాబ్‌తో మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన RCB కష్టాల్లో పడింది. 6.1 ఓవర్లలో 33 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. సాల్ట్ 4, కోహ్లీ 1, లివింగ్‌స్టోన్ 4, జితేశ్ 2, కృణాల్ ఒక పరుగుకే పెవిలియన్ చేరారు. వర్షం కారణంగా పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తోంది. మ్యాచును 14 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. PBKS బౌలర్లలో అర్ష్‌దీప్ 2, బార్ట్‌లెట్, చాహల్, జాన్‌సెన్ తలో వికెట్ తీశారు.
News April 18, 2025
60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న బీజేపీ నేత

బెంగాల్ BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్(60) పార్టీ కార్యకర్త రింకూ ముజుందార్(51)ను పెళ్లాడారు. ఇప్పటివరకు బ్రహ్మచారిగానే ఉన్న అతను తన తల్లి చివరి కోరిక మేరకు వివాహం చేసుకున్నట్లు తెలిపారు. రింకూకు ఇది రెండో వివాహం కాగా ఓ కుమారుడు కూడా ఉన్నారు. మార్నింగ్ వాక్ సందర్భంగా 2021లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇటీవల ఈడెన్ గార్డెన్స్‌లో IPL మ్యాచ్ చూడటానికి వెళ్లి పెళ్లిపై నిర్ణయం తీసుకున్నారు.
News April 18, 2025
రేపు జాగ్రత్త: ఎండలు, పిడుగులతో వర్షాలు

AP: రాష్ట్రంలో రేపు విభిన్న వాతావరణం ఉంటుందని APSDMA వెల్లడించింది. పలు జిల్లాల్లో ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 4 మండలాల్లో తీవ్ర వడగాలులు, <