News September 28, 2024
ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హతం
బీరూట్‌పై జరిపిన రాకెట్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించాడని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. శుక్రవారం రాత్రి నుంచి అతడితో కమ్యూనికేషన్ లేదని హెజ్బొల్లా సన్నిహిత వర్గాలు న్యూస్ ఏజెన్సీ AFPకి తెలపడం ఈ వార్తను కన్ఫర్మ్ చేసినట్టు అయింది. ‘హసన్ నస్రల్లా చనిపోయాడు’ అని IDF అధికార ప్రతినిధి నడవ్ షోషాని ట్వీట్ చేశారు. లెబనాన్‌లోని తూర్పు, దక్షిణ ప్రాంతాలపై IDF భీకర దాడుల గురించి తెలిసిందే.
Similar News
News October 7, 2024
సింగరేణి లాభాలు.. అత్యధికం ఎవరికంటే?
TG: సింగరేణి లాభాల వాటాలో అత్యధికంగా మంచిర్యాల(D) శ్రీరాంపూర్ SRP-1 ఎస్డీఎల్ ఆపరేటర్ ఆసం శ్రీనివాస్ రూ.3.24 లక్షలు పొందారని AITUC అధ్యక్షుడు సీతారామయ్య వెల్లడించారు. ఆ తర్వాత మందమర్రి KK-5లో చేసే జనరల్ మజ్దూర్ రాజు రూ.3.1 లక్షలు, శ్రీరాంపూర్ ఆర్కే-5కు చెందిన SDL ఆపరేటర్ ఆటికం శ్రీనివాస్ రూ.3.01 లక్షల లాభాల వాటా పొందారని తెలిపారు. వీరికి ఇవాళ C&MD కార్యాలయంలో చెక్కులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
News October 7, 2024
22, 23 తేదీల్లో విజయవాడలో డ్రోన్ సమ్మిట్
AP: విజయవాడలో ఈ నెల 22, 23 తేదీల్లో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. డ్రోన్ల తయారీ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎస్‌సీల నుంచి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 22న కృష్ణా తీరంలో 5వేల డ్రోన్లతో భారీ ప్రదర్శన జరుగుతుంది. సదస్సులో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు. విస్తృతమైన ప్రజా వినియోగానికి వీలుగా డ్రోన్లను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
News October 7, 2024
కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హార్దిక్
టీ20ల్లో అత్యధిక మ్యాచులను సిక్సర్లతో ముగించిన భారత ప్లేయర్‌గా హార్దిక్ పాండ్య నిలిచారు. బంగ్లాతో మ్యాచులో కోహ్లీ(4 మ్యాచులు) రికార్డును అధిగమించారు. ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ, పంత్ మూడేసి మ్యాచులతో ఉన్నారు. కాగా బంగ్లాదేశ్ జరిగిన T20 మ్యాచులో హార్దిక్ 39 పరుగులు చేయగా అందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు.