News February 10, 2025
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739137889692_893-normal-WIFI.webp)
TG: సెలవు దినాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టొద్దని హైడ్రాకు హైకోర్టు సూచించింది. శుక్రవారం నోటీసులిచ్చి, వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయమిస్తూ ఆదివారం కూల్చివేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి(D) అబ్దుల్లాపూర్‌మెట్(M) కోహెడలో నిర్మాణాల కూల్చివేతలపై నమోదైన పిటిషన్‌ను విచారించింది. వివరణ ఇచ్చేందుకు భవన యజమానులకు సహేతుకమైన సమయం ఇవ్వాలని పేర్కొంది.
Similar News
News February 10, 2025
‘నమస్కారం’.. వివిధ రాష్ట్రాల్లో ఇలా!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739187703602_746-normal-WIFI.webp)
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ- నమస్కారం, అరుణాచల్- జైహింద్, అసోం- నొమొస్కార్, బిహార్- ప్రణామ్, గుజరాత్- జై శ్రీకృష్ణ, హరియాణా- రామ్ రామ్, ఝార్ఖండ్ – జోహార్, కర్ణాటక- నమస్కార, కేరళ- నమస్కారం, MP- నమస్తే, MH- నమస్కార్, మణిపుర్ – కురుమ్జరి, మిజోరం – చిబాయ్, నాగాలాండ్ – కుక్నలిమ్, ఒడిశా- నమస్కార్, పంజాబ్ – సత్ శ్రీ అకల్, రాజస్థాన్ – రామ్ రామ్, TN – వనక్కం, యూపీ- రాధే రాధే, వెస్ట్ బెంగాల్ – నమొష్కార్.
News February 10, 2025
UKలో 600 మంది అక్రమ వలసదారుల అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739187032209_1323-normal-WIFI.webp)
యూకేలోకి చట్టవ్యతిరేకంగా ప్రవేశించి వివిధ పనులు చేస్తున్న 600మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరిలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. వీరంతా అక్రమంగా UKలో ప్రవేశించి రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్, తదితర ప్రదేశాల్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. గతేడాది జులై నుంచి జనవరి వరకూ 4వేల మంది అక్రమ వర్కర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
News February 10, 2025
వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739180697929_695-normal-WIFI.webp)
AP: మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడి చిన్న కుమారుడు గాలి జగదీశ్ వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. ఎల్లుండి మాజీ సీఎం జగన్ సమక్షంలో కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. నగరి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గాలి భానుప్రకాశ్ సోదరుడే పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మాజీ మంత్రి రోజాకు చెక్ పెట్టేందుకు జగదీశ్‌ను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.