News February 10, 2025
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

TG: సెలవు దినాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టొద్దని హైడ్రాకు హైకోర్టు సూచించింది. శుక్రవారం నోటీసులిచ్చి, వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయమిస్తూ ఆదివారం కూల్చివేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి(D) అబ్దుల్లాపూర్‌మెట్(M) కోహెడలో నిర్మాణాల కూల్చివేతలపై నమోదైన పిటిషన్‌ను విచారించింది. వివరణ ఇచ్చేందుకు భవన యజమానులకు సహేతుకమైన సమయం ఇవ్వాలని పేర్కొంది.
Similar News
News April 17, 2026
రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు @263.!

AP: డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 175కు 88 స్థానాలు కలిసి 263కు ఆ సంఖ్య చేరనుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అటు 33% మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావడంతో వీటిల్లో 88 నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి చేరుతాయని చెబుతున్నారు.

ఇంకా క్రేజీ రీల్స్ చేస్తా: అర్ష్‌దీప్

అర్ష్‌దీప్ సింగ్ IPLలో 100 వికెట్ల క్లబ్‌లో చేరిపోయారు. గ్రౌండ్‌లో నిప్పులు చెరిగే బాల్స్‌తో భయపెట్టే ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.. బయట మాత్రం ఫుల్ జోవియల్‌గా ఉంటారు. తనకు ఇన్‌స్టా రీల్స్ చేయడం అంటే ఇష్టమని, ఫ్యాన్స్ కూడా ఆటతో పాటు రీల్స్ చూసి బాగా కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చారు. తన సోషల్ మీడియా క్రేజ్ వల్లే దేశమంతటా సపోర్ట్ లభిస్తోందని.. ఫ్యాన్స్ కోసం మరిన్ని క్రేజీ రీల్స్ చేస్తానని ప్రామిస్ చేశారు.