News December 12, 2024

రాష్ట్ర పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

image

AP: రాష్ట్రంలో హెల్మెట్‌ నిబంధన అమలు కావట్లేదని పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల 667 మంది మరణించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో హెల్మెట్‌ నిబంధన ఎందుకు అమలు చేయట్లేదు? అని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ మరణాలకు బాధ్యత ఎవరిది? అని సీరియస్ అయింది. దీనిపై వారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News September 15, 2025

ప్రెగ్నెన్సీలో డ్రైవింగ్.. సురక్షితమేనా?

image

చాలామంది గర్భిణులు ఉద్యోగం సహా ఇతర కారణాలతో ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. స్కూటీ, కారును వారే స్వయంగా నడుపుతుంటారు. అయితే డాక్టర్ సలహాతో, గుంతలు లేని రోడ్లపై నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలి. నెలలు నిండే కొద్దీ బరువు పెరుగుతారు. కాబట్టి.. ఆ సమయంలో బ్రేక్ వేయటానికి, వాహనం బ్యాలెన్స్ చేయడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. వీలైనంత వరకు గర్భంతో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయటం తగ్గించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

News September 15, 2025

స్త్రీ శక్తి పథకంతో మహిళలకు రూ.118 కోట్ల లబ్ధి: మంత్రి

image

AP: నేటితో స్త్రీ శక్తి పథకం(బస్సుల్లో ఉచిత ప్రయాణం) విజయవంతంగా నెల రోజులు పూర్తి చేసుకుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మహిళలు 3.17 కోట్ల ఉచిత టికెట్లతో ప్రయాణించారని పేర్కొన్నారు. సగటున స్త్రీ శక్తి బస్సులు 90% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయన్నారు. మహిళా పురుషుల నిష్పత్తి 63:37గా ఉందని వెల్లడించారు. ఈ పథకంలో మహిళలకు నెల రోజుల్లో రూ.118 కోట్ల ఆర్థిక లబ్ధిని చేకూర్చిందని చెప్పారు.

News September 15, 2025

ఆ పూలు పూజకు పనికిరావు!

image

పువ్వుల విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. ‘కింద పడిన, వాసన చూసిన, ఎడమ చేతితో కోసిన పువ్వులను పూజకు వాడరాదు. ఎడమ చేత్తో, ధరించిన వస్త్రాలలో, జిల్లేడు/ఆముదం ఆకులలో తీసుకొచ్చిన పువ్వులను కూడా ఊపయోగించకూడదు’ అని చెబుతున్నారు. పూజలో పువ్వులను సమర్పించేటప్పుడు మధ్య వేలు, ఉంగరపు వేలు మాత్రమే వాడాలి’ అని అంటున్నారు.