News December 12, 2024
రాష్ట్ర పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
AP: రాష్ట్రంలో హెల్మెట్ నిబంధన అమలు కావట్లేదని పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ ధరించకపోవడం వల్ల 667 మంది మరణించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో హెల్మెట్ నిబంధన ఎందుకు అమలు చేయట్లేదు? అని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ మరణాలకు బాధ్యత ఎవరిది? అని సీరియస్ అయింది. దీనిపై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News January 17, 2025
IPS సునీల్‌కుమార్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశం
AP: సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్‌పై విచారణకు స్పెషల్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీశ్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. సునీల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలపై వీరు దర్యాప్తు చేసి నివేదిక సమర్పించనున్నారు.
News January 17, 2025
భారీగా తగ్గిన భారత ఫారెక్స్ నిల్వలు
గత కొన్ని వారాలుగా భారత ఫారెక్స్ నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. జనవరి 10తో ముగిసిన వారానికి ఇండియా నిల్వలు $8.714 బిలియన్లు తగ్గి $625.871 బిలియన్లకు చేరాయి. అంతకు ముందు వారంలో $5.693 బిలియన్లు తగ్గాయి. రూపాయి విలువ మరింత పడిపోకుండా ఉండేందుకు ఆర్బీఐ ఇటీవల కాలంలో ఫారెక్స్‌లో జోక్యం చేసుకుంటోంది. కాగా చివరిసారిగా గతేడాది సెప్టెంబర్‌లో ఫారెక్స్ రిజర్వ్‌లు $704.885 జీవిత కాల గరిష్ఠానికి చేరాయి.
News January 17, 2025
మంచు బ్రదర్స్ ట్వీట్స్ వార్
‘రౌడీ’ సినిమాలోని డైలాగ్‌తో Xలో విమర్శలు చేసిన విష్ణు ట్వీట్‌కు మనోజ్ కౌంటర్ ఇచ్చారు. ‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావ్’ అని విష్ణు ట్వీట్ చేశారు. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిలా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకు ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్’ అని మనోజ్ కౌంటర్ ఇచ్చారు.