News June 24, 2024
వాలంటీర్ల రాజీనామా అంశంపై హైకోర్టు విచారణ
AP: వాలంటీర్ల రాజీనామాల అంశంపై BYC పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సుమారు 64వేల మంది రాజీనామా చేశారని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇందులో కొందరిని బలవంతంగా రాజీనామా చేయించారని, వాలంటీర్ల ఫిర్యాదులతో YCP నేతలపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని EC, ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు విచారణను 4వారాలకు వాయిదా వేసింది.
Similar News
News November 12, 2024
అమెరికన్ M4 రైఫిల్స్.. అఫ్గాన్ టు భారత్ వయా పాక్
ఇటీవల J&Kలో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చిన ఆర్మీ అత్యాధునిక అమెరికన్ M4 కార్బైన్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఇవి అఫ్గాన్ నుంచి పాక్ టెర్రరిస్టులకు చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. US బలగాలు 2021లో అఫ్గాన్‌ను వీడుతూ $7bn విలువైన ఆయుధాలను వదిలేశాయి. వాటిలో వేలాదిగా M4 రైఫిల్స్ ఉన్నాయి. లైట్ వెయిట్‌తో ఉండే వీటి ద్వారా నిమిషానికి 700-900 రౌండ్స్ కాల్చవచ్చు. రేంజ్ 500M-3,600M వరకు ఉంటుంది.
News November 12, 2024
అమృత్ టెండర్లలో అవినీతి పెద్ద జోక్: కోమటిరెడ్డి
TG: కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందనేది పెద్ద జోక్ అని చెప్పారు. ‘CM రేవంత్‌కు సృజన్ రెడ్డి తోకచుట్టం. కవిత, సృజన్ రెడ్డిలు వ్యాపార భాగస్వాములు. పాలమూరు టన్నెల్ పనులను వారిద్దరే చేశారు. దీనికి KTR సమాధానమివ్వాలి. అధికారులపై దాడులు, అమృత్ టెండర్లలో అవినీతి అని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు.
News November 12, 2024
FLASH: హాల్‌టికెట్లు విడుదల
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL) టైర్-2 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను SSC విడుదల చేసింది. అభ్యర్థులు <