News October 23, 2024

పేకాట క్లబ్ యాజమాన్యాలకు హైకోర్టు చురకలు

image

AP: రమ్మీ ఆట విషయంలో జోక్యం చేసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించింది. కొంతకాలం పేకాట ఆడకపోతే ఆకాశమేమీ కిందపడిపోదని వ్యాఖ్యానించింది. కనీసం ఈ సమయంలోనైనా కుటుంబాలు సంతోషంగా ఉంటాయని అభిప్రాయపడింది. నిజాలు తెలుసుకోకుండా ఉత్తర్వులిస్తే పేకాటను కోర్టులు ప్రోత్సహిస్తున్నాయనే భావన ప్రజల్లోకి వెళుతుందని పేర్కొంది.

Similar News

News October 23, 2024

ఆయిల్ ట్యాంకర్‌లో ఇదేంది భయ్యా!

image

బిహార్‌లో ‘పుష్ప’ రేంజ్‌లో స్మగ్లింగ్ వెలుగుచూసింది. ముజఫర్‌పూర్‌లో హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంకర్‌పై అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించగా నిందితులు ఆ వాహనాన్ని జాతీయరహదారిపై వదిలి పరారయ్యారు. ట్యాంకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో మద్యం కాటన్లు ఉన్నాయి. మద్యం అరుణాచల్‌ప్రదేశ్‌లో తయారైనట్లు పోలీసులు గుర్తించారు. బిహార్‌లో లిక్కర్ అమ్మకాలు నిషేధం. అందుకే స్మగ్లర్లు ఇలా తప్పుడు దారులు ఎంచుకుంటున్నారు.

News October 23, 2024

వయనాడ్: ప్రియాంకా గాంధీని ఢీకొంటున్న ‘యాక్సిడెంటల్ పొలిటీషియన్’

image

ప్రియాంకా గాంధీతో తలపడుతున్న BJP అభ్యర్థి నవ్యా హరిదాస్‌ది కోజికోడ్. వీరి కుటుంబానికి సంఘ్‌తో అనుబంధం ఉంది. 2009లో పెళ్లయ్యాక సింగపూర్‌కు వెళ్లిన నవ్య సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేశారు. 2015లో కోజికోడ్ ట్రిప్‌కు వచ్చి లోకల్‌బాడీ ఎలక్షన్లో పోటీ చేశారు. ఓడితే సింగపూర్ వెళ్దామనుకున్న ఆమె వరుసగా 2 సార్లు గెలిచి పార్టీలో ఎదిగారు. 2021లో కోజికోడ్ సౌత్ నుంచి MLAగా ఓడినా BJP ఓట్ల శాతం17-21కి పెంచారు.

News October 23, 2024

భారీ వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక

image

బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాన్ కారణంగా APలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తీరం వెంట గంటకు 80-90KM వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంది. ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలంది. రేపు అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.