News October 23, 2024

పేకాట క్లబ్ యాజమాన్యాలకు హైకోర్టు చురకలు

image

AP: రమ్మీ ఆట విషయంలో జోక్యం చేసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించింది. కొంతకాలం పేకాట ఆడకపోతే ఆకాశమేమీ కిందపడిపోదని వ్యాఖ్యానించింది. కనీసం ఈ సమయంలోనైనా కుటుంబాలు సంతోషంగా ఉంటాయని అభిప్రాయపడింది. నిజాలు తెలుసుకోకుండా ఉత్తర్వులిస్తే పేకాటను కోర్టులు ప్రోత్సహిస్తున్నాయనే భావన ప్రజల్లోకి వెళుతుందని పేర్కొంది.

Similar News

News November 11, 2024

ఐదు వికెట్లు తీసిన వరుణ్

image

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సత్తా చాటారు. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 5 వికెట్లు తీశారు. టీ20Iల్లో 5 వికెట్లు తీయడం ఆయనకిదే తొలిసారి. మొత్తంగా 11 మ్యాచుల్లో 15 వికెట్లు తీయడం గమనార్హం.

News November 11, 2024

భారీ భూకంపం.. వణికిన క్యూబా

image

క్యూబాలో భారీ భూకంపం సంభవించింది. బార్టోలోమోకు 40 కి.మీ దూరంలో 13 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ఆ సమీపంలోని మంజనిల్లో, శాంటియాగో ప్రాంతాలు వణికిపోయాయి. సునామీ హెచ్చరికలేమీ జారీ చేయలేదు.

News November 11, 2024

రాత్రి ఆలస్యంగా నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

image

రాత్రి త్వరగా నిద్రించి ఉదయం త్వరగా నిద్రలేస్తే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఆలస్యంగా పడుకుంటే మెటబాలిజం తగ్గి బరువు పెరుగుతారు. డయాబెటిస్‌ బారిన పడతారు. రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోయి తరచూ జలుబు, దగ్గు లాంటి సమస్యలు వస్తాయి. మెదడు పనితీరు మందగిస్తుంది. రోజంతా బద్దకంగా అనిపిస్తుంది. మహిళలకు హార్మోన్ల బ్యాలెన్స్ తప్పి పీరియడ్స్ సరిగ్గా రావని వైద్యులు హెచ్చరిస్తున్నారు.