News August 13, 2024

EWS కోటా నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

image

AP: వైద్య కళాశాలల్లో EWS కోటా సీట్ల జీవోను తాత్కాలికంగా నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సీట్లు పెంచకుండానే EWS కోటా అమలు చేస్తున్నారని, దీని వల్ల ఓపెన్ కేటగిరి కింద ఉన్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. సీట్లు పెంచి EWS కోటా కింద భర్తీ చేయాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవోను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News September 11, 2024

రుణమాఫీ సర్వే 50% పూర్తి.. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు

image

TG: రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి కుటుంబ నిర్ధారణ సర్వే 50% పూర్తయింది. రేషన్ కార్డులు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ కాని 4.24 లక్షల మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. దీంతో అధికారులు గ్రామాలకు వెళ్లి వివరాలను సేకరిస్తూ ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. త్వరలోనే సర్వే పూర్తి చేసి, సర్వేలో గుర్తించిన రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.

News September 11, 2024

టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం: సీఎం రేవంత్

image

TG: టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ట్రైనీ ఎస్సైల పాసింగ్ పరేడ్‌లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. తెలంగాణ పునర్నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

News September 11, 2024

కేసీఆర్ కల సాకారమైంది: హరీశ్ రావు

image

TG: కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు రావడం సంతోషకరమని హరీశ్ రావు అన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందని, దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 850 ప్రభుత్వ మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4,090కి చేరిందని వివరించారు.