News March 22, 2024
అలంపూర్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

TG: అలంపూర్ BRS MLA విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. తదుపరి విచారణను APR 18కి వాయిదా వేసింది. ‘పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే విజయుడు నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాల్లో తన ఉద్యోగం గురించి ప్రస్తావించలేదు. ఈసీ రూల్స్‌కు ఇది విరుద్ధం. ఆయన ఎన్నిక చెల్లదు’ అని BSP అభ్యర్థి ప్రసన్న కోర్టును ఆశ్రయించారు.
Similar News
News February 7, 2026
ఈ 2 నెలలు దోమలతో జాగ్రత్త

ఫిబ్రవరి, మార్చి నెలల్లో దోమల బెడద మరింత పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నవంబర్ నుంచి జనవరి వరకు దోమలు గుడ్లు పెట్టగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగి వాటి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. దోమలు తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో అత్యంత చురుగ్గా ఉంటాయని, గాలిలో తేమ వల్ల కుడతాయని చెప్పారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, కిటికీలు మూయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News February 7, 2026
చైనా సరికొత్త ఆయుధం.. శాటిలైట్లకు ముప్పు

భూమి నుంచే శాటిలైట్లను ధ్వంసం చేసే హైపవర్ మైక్రోవేవ్ వెపన్‌ను చైనా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. గిగావాట్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ఈ సిస్టమ్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ వంటి లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను టార్గెట్ చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ట్రక్కులు, షిప్‌లు, విమానాలపై అమర్చేలా ఈ ఆయుధాన్ని రూపొందించినట్లు సమాచారం. ఈ వెపన్‌పై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.