News March 22, 2024
అలంపూర్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

TG: అలంపూర్ BRS MLA విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. తదుపరి విచారణను APR 18కి వాయిదా వేసింది. ‘పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే విజయుడు నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాల్లో తన ఉద్యోగం గురించి ప్రస్తావించలేదు. ఈసీ రూల్స్‌కు ఇది విరుద్ధం. ఆయన ఎన్నిక చెల్లదు’ అని BSP అభ్యర్థి ప్రసన్న కోర్టును ఆశ్రయించారు.
Similar News
News February 15, 2025
GREAT… చాయ్ ఓనర్ టూ మున్సిపల్ మేయర్

రాయగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జీవర్ధన్ చౌహాన్ ఘన విజయం సాధించారు. దీంతో ఇన్నాళ్లూ నగరంలో ‘టీ దుకాణం’ నడిపిన వ్యక్తి మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ తమ మేయర్ అభ్యర్థిగా జీవర్ధన్ ను ప్రకటించింది. సీఎం సైతం తన దుకాణంలో టీ అమ్ముతూ ప్రచారం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో పది మున్సిపల్ కార్పొరేషన్లను గెలిచి బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది.
News February 15, 2025
కూతురిని ప్రేమించాడని..

TG: సంగారెడ్డిలో మెగ్యానాయక్ తండాలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న తన కుమార్తెను ప్రేమించాడనే నెపంతో దశరథ్ అనే వ్యక్తిని గోపాల్ హతమార్చాడు. అనంతరం నారాయణఖేడ్ పీఎస్‌లో లొంగిపోయారు. మరోవైపు దశరథ్‌కు అప్పటికే పెళ్లవ్వగా.. 4 రోజులుగా కనిపించకుండా పోయాడని భార్య ఫిర్యాదు చేసింది. తాజాగా హత్యకు గురైనట్లు తేలడంతో మృతదేహం కోసం గాలిస్తున్నారు.
News February 15, 2025
పేరెంట్స్ సెక్స్ కామెంట్స్.. యూట్యూబర్ తరఫున వాదించేది ఎవరంటే?

‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో <<15413969>>వివాదాస్పద వ్యాఖ్యలతో<<>> కేసు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియ తనపై నమోదైన కేసులు కొట్టేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన తరఫున వాదించేది మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కొడుకు అభినవ్ చంద్రచూడ్. బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అభినవ్ ముంబైలోనే లా పట్టా పొందారు. హార్వర్డ్ లా స్కూల్లో LLM చదివారు.