News September 27, 2024
హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు

TG: అమీన్పూర్లో ఓ బిల్డింగ్ కూల్చివేతపై హైడ్రాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని కమిషనర్ రంగనాథ్‌ను ప్రశ్నించింది. ఈ నెల 30న ఉదయం 10:30 గంటలకు వర్చువల్‌గా లేదా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
Similar News
News October 25, 2025
ఎర్రిస్వామి గురించి అప్పుడే తెలిసింది: ఎస్పీ

AP: కర్నూలు బస్సు ప్రమాదంపై SP విక్రాంత్ పాటిల్ మరిన్ని విషయాలు వెల్లడించారు. ‘బైక్‌పై మరో వ్యక్తి ఉన్నాడని తెలిసి తుగ్గలి వెళ్లి ఆరా తీశాం. అప్పుడే ఎర్రిస్వామి గురించి తెలిసింది. అతడు HYD GHMCలో పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఎర్రిస్వామిని ఇంటి వద్ద దిగబెట్టేందుకు వెళ్తుండగా వర్షం వల్ల బైక్ స్కిడ్ అయింది. బస్సులో 250 స్మార్ట్ఫోన్ల రవాణాపై FSL నివేదిక తర్వాత స్పష్టత వస్తుంది’ అని వెల్లడించారు.
News October 25, 2025
7,267 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. OCT 23తో అప్లై గడువు ముగియగా.. OCT 28 వరకు పొడిగించారు. PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్సైట్: https://nests.tribal.gov.in
News October 25, 2025
WWC: భారత్ సెమీస్‌లో తలపడేది ఈ జట్టుతోనే

AUSతో మ్యాచ్‌లో SA ఘోర ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన SA 97 రన్స్‌కే ఆలౌట్ కాగా AUS 16.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. 13 పాయింట్లతో టాప్ ప్లేస్‌ను ఖాయం చేసుకుంది. భారత్ రేపు బంగ్లాతో జరిగే చివరి మ్యాచ్‌లో గెలిచినా నాలుగో ప్లేస్లోనే ఉంటుంది. దీంతో ఈనెల 30న రెండో సెమీఫైనల్లో పటిష్ఠ AUSతో IND తలపడనుంది. ఈ గండం గట్టెక్కితేనే తొలి WCకు భారత్ చేరువవుతుంది. తొలి సెమీస్‌లో SA, ENG తలపడతాయి.


