News September 27, 2024
హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు
TG: అమీన్‌పూర్‌లో ఓ బిల్డింగ్ కూల్చివేతపై హైడ్రాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని కమిషనర్ రంగనాథ్‌ను ప్రశ్నించింది. ఈ నెల 30న ఉదయం 10:30 గంటలకు వర్చువల్‌గా లేదా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
Similar News
News October 12, 2024
ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు: పొన్నం
TG: కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిద్దిపేట(D) హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల అంచనా కోసమే సర్వే చేపడుతున్నాం. 60 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ కార్యక్రమం చేపడతాం. కులగణనకు ప్రజలంతా సహకరించాలి’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు.
News October 12, 2024
ఆ విషయంలో భాగస్వామి వద్దకు కాకపోతే ఇంకెవరి వద్దకు వెళ్తారు: హైకోర్టు
నైతిక నాగరిక సమాజంలో ఒక వ్యక్తి (M/F) శారీరక, లైంగిక కోరికలను తీర్చుకోవడానికి భాగస్వామి వద్దకు కాకుండా ఇంకెవరి దగ్గరకు వెళ్తారని అలహాబాద్ హైకోర్టు ప్రశ్నించింది. భర్తపై పెట్టిన వరకట్నం కేసులో భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసు కొట్టేసింది. ఈ కేసు ఇద్దరి మధ్య లైంగిక సంబంధ అంశాల్లో అసమ్మతి చుట్టూ కేంద్రీకృతమైనట్టు పేర్కొంది.
News October 12, 2024
చంద్రబాబును కలిసి చెక్కులను అందించిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి రూ.కోటి విరాళం అందజేశారు. తన తరఫున రూ.50 లక్షలు, కుమారుడు రాంచరణ్ తరఫున రూ.50 లక్షల చెక్కులను ముఖ్యమంత్రికి ఇచ్చారు. విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి ఈ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.